బీజేపీ అధ్యక్షుడు , హోంమంంత్రి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ జగన్ నోరెత్తలేదు. నోరెత్తితే ఆయనకు తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. అదే సమయంలో కేసీఆర్ కూడా… జగన్ పరిపాలనను ఘోరంగా అవమానిస్తున్నారు. తమ రాష్ట్రం గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఆయన ఏపీని కించ పరుస్తున్నారు. కానీ జగన్ నోరు మెదపడానికి భయపడుతున్నారు. కేసీఆర్ పై నోరెత్తడానికి పార్టీ నేతలకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. కానీ హరీష్ రావులాంటి వాళ్లు అదే విమర్శలు చేస్తే.. మాత్రం ఆయన.. కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని… తమకు మాత్రమే సాధ్యమైన లాజిక్కులు చెప్పడానికి .. పదవులు పీకేసిన పేర్ని నాని, కొడాలి నానిలను రంగంలోకి దించుతారు.
అయితే అసలు అధ్యక్షుడు మాట్లాడితేనే దేనికైనా విలువ ఉంటుంది. జగన్ రెడ్డి ఎవర్నీ ఏమీ విమర్శించకుండా కింది స్థాయి నేతలు మాట్లాడితే విలువ ఉండదు. అదంతా మానసికంగా తృప్తి పరుచుకోవడానికి పనికి వస్తుంది. ధైర్యంగా నేరుగా తనను విమర్శించిన వారికి ప్రభుత్వాధినేత సమాధానం చెప్పకపోతే.. ఇక ఆయనకు పొలిటికల్ క్యారెక్టర్ ఉందని ఎవరైనా అనుకుంటారా ? .అనుకునే అవకాశం లేదు. అయితే క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు.. తాను మాత్రమే సేఫ్ గా ఉండాలని ఇతర నేతల్ని మాత్రమే వాడేసుకుంటున్నారు.
ఇప్పటికే ఇద్దరు నానీలు … జగన్ కోసం అన్ని రకాల గీతలు దాటిపోయారు. రేపు ఓడిపోతే వారి పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఒక్క నాని కాదు.. మిగతా వారు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి చాలా సేఫ్ గా ఉంటారు. ఆయనపై ఈగ వాలదు. కానీ ఆయన కోసం నోరు చేసుకున్న నేతలంతా రిస్క్ లో పడిపోతున్నారు. జగన్ కోసం బలిపశువులు అవుతున్నారన్న అభిప్రాయం అందుకే వినిపిస్తోంది.