వారాహి తొక్కుకుంటూ వెళ్లడానికి రంగం సిద్ధమయింది. అన్నవరం నుంచి జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తున్నారు పవన్. కాకినాడ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. అన్నవరంలో ప్రారంభమయ్యే యాత్ర కత్తిపూడి, ఉప్పాడ బస్టాండ్ సెంటర్, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు.
పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో ఈ సందర్శన ఉంటుంది.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు. మొదటి విడతలో జూన్24 వరకు యాత్ర సాగనుంది. యాత్రంలో భగంగా ఇవాళ కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తివారితో పవన్ మాట్లడబోతున్నారు.
ఇప్పటిదాకా ఓ లెక్క .. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా రాజకీయం ఉంటుందని. జనసేన వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.