వైసీపీలో చేరబోతున్న అంబటి రాయుడుకి పబ్లిసిటీ ఇచ్చే టాస్క్ ను టీవీ9 తీసుకుంది. అయితే చివరికి అది అంబటిరాయుడి నైజాన్ని బయటపెట్టే కార్యక్రమంగా మారిపోయింది. మొత్తంగా క్రికెట్ వివాదాలు.. రాజకీయ వ్యాఖ్యలు చేయించారు. ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి.. ఆ విషయాలు పక్కన పెట్టిన.. క్రికెట్ కెరీర్ లో అంబటి రాయుడు ఎందుకు ఎదగలేదన్న విషయాన్ని ఆయన నోటితోనే చెప్పించింది టీవీ9.
ఎక్కడికి వెళ్లినా… ఎవరితో అయినా ఆరోపణలే.. వివాదాలేనని అంబటి రాయుడు స్వయంగా చెప్పుకున్నారు. మొదట హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు శివలాల్ యాదవ్ తో గొడవ.. అక్కడ పడలేదని.. ఆంధ్రాజట్టుకు వెళ్లాడు.. అక్కడ కెప్టెన్ ఎమ్మెస్కేతో గొడవ… ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ టీమ్ కు వచ్చారట… వచ్చినా సరిపడలేదు.. మళ్లీ బరోడాకు వెళ్లారు. అక్కడేం జరిగిందో చెప్పలేదు కానీ అక్కడా గొడవలు కాబట్టి మళ్లీ బయటకు వచ్చారు. ఒకరిద్దరితో గొడవలు అనుకోవచ్చు కానీ.. ప్రతి ఒక్కరితోనూ గొడవలు పడితే ఎవరిది పొరపాటు..అనేది ఆ ప్రోగ్రాం చూస్తున్న వారికి వచ్చే సందేహం.
ప్రపంచకప్ కు తనను ఎంపిక చేయకపోవడానికి అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కేనే కారణం అని అంబటి ఆరోపించారు. సెలక్షన్ పద్దతి ఎలా ఉంటుందో తెలిసి కూడా ఎమ్మెస్కే పై నిందలేస్తున్నారని చాముండేశ్వరినాథ్ అదే ప్రోగ్రాంలో చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అంబటి రాయుడు.. తన వైఫల్యాలకు ఇతరుల్ని బాధ్యతుల్ని చేయడానికి ప్రోగ్రాంను ఎంచుకున్నారు. ఆ విషయం చూసేవారికి అర్థమవుతుంది.
మొత్తంగా అంబటి రాయుడుకు ఏదో ఇమేజ్ తెద్దామని టీవీ9 ప్రయత్నించింది కానీ.. చివరికి క్రీడాపురుగులు అనే టైటిల్‌తో బ్యాక్ గ్రౌండ్ పెట్టి… అంబటి రాయుడు ఫోటోను కూడా పెట్టి తాను ఏం ప్రెజెంట్ చేసిందో చెప్పకనే చెప్పింది. పాపం అంబటి రాయుడు.