డీజే టిల్లుతో ఓ సూపర్ హిట్టు కొట్టాడు సిద్దు జొన్నలగడ్డ. అంతకు ముందు కూడా సిద్దూ చాలా డీసెంట్ సినిమాలే చేశాడు. కానీ రావల్సినంత పేరు, గుర్తింపు రాలేదు. టిల్లుతో మాత్రం ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు తన చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. మరో యేడాది వరకూ కొత్త ప్రాజెక్టుల్ని ఎంచుకొనే ఖాళీనే లేదు. తను ఇప్పుడు రూ.4 కోట్లు పలుకుతున్నాడని టాక్. టిల్లుకి సీక్వెల్ గా డీజే టిల్లు స్వ్కేర్ రూపుదిద్దుకొంటోంది. దీనికి రూ.3.5 కోట్లు అందుకొన్నాడని తెలుస్తోంది. చిరంజీవి – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో చిరు తనయుడిగా సిద్దు నటిస్తున్నాడు. ఈ సినిమాకి అరకోటి పెంచి… రౌండ్ ఫిగర్‌గా రూ.4 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట. సిద్దుకి జోడీగా శ్రీలీలని ఎంచుకొన్నారు. తన పారితోషికం కోటిపైనే. టిల్లు సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా కూడా హిట్టయితే.. సిద్దు ఈజీగా తన పారితోషికాన్ని డబుల్ చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యువ హీరోలకు ఇప్పుడు డిమాండ్ ఆ రేంజ్లో ఉంది.