‘అహింస’తో… ఎంట్రీ ఇచ్చిన మరో దగ్గుబాటి హీరో… అభిరామ్. తేజ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దీనిపై ఎవ్వరికీ ఎలాంటి నమ్మకాలూ లేవు. ఆ అపనమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ కి మైనస్ మార్కులు పడ్డాయి. తన ఫేస్‌లో ఎలాంటి ఫీలింగ్స్ పండలేదని, బొమ్మలా ఉన్నాడని కామెంట్లు వినిపించాయి. ఇదే.. అభిరామ్ ఆఖరి సినిమా అవుతుందేమో అని కూడా సెటైర్లు వేసుకొన్నారు.
కానీ నిజానికి పరిస్థితి అలా లేదు. నలుగురైదుగురు నిర్మాతలు `అభిరామ్ కావాలి..` అంటూ సురేష్‌బాబు వెంట పడుతున్నార్ట. కథలూ సిద్ధం చేసేసుకొన్నార్ట. అభిరామ్ ఫాలోయింగ్ చూసి సురేష్ బాబే షాక్ అవుతున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఆ నిర్మాతల ధైర్యం ఏమిటంటే.. కొత్త హీరోలకంటే, తెలిసిన ఫేస్ బెటర్ అని. పైగా పబ్లిసిటీ, రిలీజ్ విషయంలో సురేష్‌బాబు సహాయపడతారని ప్లానింగులు వేసుకొంటున్నారు. నిజానికి అభిరామ్ కి కూడా సినిమాలపై అంతగా ఆసక్తి లేదని తెలుస్తోంది. ఒకవేళ చేస్తే… ష్యూర్ షాట్ హిట్ కొడతామన్న కథతోనే రెండో సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. కొత్త దర్శకుడైనా ఫర్లేదు, కథనే నమ్ముకొని వెళ్తామనుకొంటున్నారు. మరి అలాంటి కథ అభికి దొరుకుతుందో, లేదో..?