జనసేన అధినేతక పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆయన పర్యటనలో తరచూ సెక్యూరిటీ లోపాలు బయటపడుతున్నాయి. ప్రస్తుత పాలకులు పూర్తి స్థాయిలో నేర మనస్థత్వం ఉన్న వారు కావడంతో పవన్ కల్యాణ్ కూడా ఆందోళన చెందుతున్నారు. తన ప్రాణానికి ముప్పు కల్పించేందుకు సుపారీ గ్యాంగులతో మాట్లాడినట్లుగా తనకు సమాచారం ఉందని ఆయన చెబుతున్నారు. . పవన్ కల్యాణ్ ఇలా తన భద్రత విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.
వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పవన్ పై కుట్ర ఆలోచనల్ని బయట పెడుతోంది. ఇటీవల వైసీపీ పెద్దలతో కలిసిపోయి… సాక్షిలో కుట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్న కేఏ పాల్.. నాలుగు రోజుల కిందట .. పవన్ కల్యాణ్‌కు ముప్పు ఉందని ప్రకటించారు. చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ప్రకటిచారు. ఇదంతా వైసీపీ గేమ్ ప్లాన్ అనే అనుమానాలు ఈ కారణంగానే వస్తున్నాయి. తాము చేయాల్సిన పనిని.. చేయడానికి ముందు ఇలా ఇతరులపై ఆరోపణలు చేస్తారని.. చేసేసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అనే స్టోరీలు రాస్తారని ఇప్పటికే చాలా మందికి ఓ క్లారిటీ వచ్చింది.
పవన్‌పై వైసీపీ నేతలు పూర్తి అసహనంతో ఉన్నారు. తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కూడా జాగ్రత్తగా ఉడాల్సి ఉంది. ఆయన వద్ద ఉన్న సమాచారంతో కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి ఉంది. గతంలోనూ పవన్ ఇంటి వద్ద రెండు ఇన్సిడెంట్లు జరిగాయి. అయితే అవన్నీ యాధృచ్చికంగా జరిగాయని కుట్ర లేదని పోలీసులు తేల్చారు. కానీ.. రెక్కీ చేయడం యాధృచ్చికం ఎలా అవుతుందని జన సైనికులు ప్రశ్నలు గుప్పించారు.