కాకినాడ నుంచి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి గెలవనీయనని పవన్ కల్యాణ్ చాలెంజ్ చేశారు. వారాహియాత్ర కాకినాడ చేరుకున్న సందర్భంగా సర్పవరం జంక్షన్ లో ఆయన మాట్లాడారు., పెద్ద ఎత్తున హాజరైన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ద్వారంపూడి ఇంట్లోనే రౌడీలంతా ఉంటారని.. వారి కుటుంబసభ్యులకు చాలా మందికి బేడీలు వేశారని తెలిసిందన్నారు. ద్వారంపూడి దోపిడీదారుడని.. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేసి రూ. పదిహేను వేల కోట్ల మేర దోచేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకుని ద్వారంపూడి దోపిడీదారుడిగా మారారన్నారు. కాపు మహిళలను కాపు రౌడీలతో కొట్టించారని.. తనకు అవకాశం వస్తే గూండాలను తన్నుకుంటూ తీసుకెళ్తానని హెచ్చరించారు. మా నేతలను అసెంబ్లీ పంపండి.. దోపిడీని అరికడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాకినాడ సెంటర్లో నిలబడి ద్వారంపడిని హెచ్చరిస్తున్నాన్నారు. వైసీపీ నేతలు దళితుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే పట్టించుకున్న వారు లేరన్నారు. వైసీపీ ఎస్సీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశనించారు. ఎస్సీ, బీసీ యువతను చంపేస్తూంటే వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మన రాష్ట్రంలో కులం అనే భావన అందరిలో ఉందని.. అది పోతే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. అందరిలోనూ మన రాష్ట్రం అనే భావన రావాల్సి ఉందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని. గంజాయి మత్తులో యువత నేరాలో చేస్తోదని వేదన వ్యక్తం చేశారు. అమిత్ శాంతిభద్రతల విషయంలో చేసిన వ్యాఖ్యల్లో లోతైన అర్థం ఉందన్నారు.
కాకినాడలో ద్వారంపూడి సంగతి చెబుతానని.. మూడు రోజుల నుంచి పవన్ హెచ్చరికలు జారీచేస్తున్నారు. దీంతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయేమోనని అనుకున్నారు. కానీ పెద్దగా ఇబ్బంది లేకుండా పర్యటన సజావుగా సాగింది.