ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం హెలికాఫ్టర్ పై పెడన వెళ్లారు. ఎందుకంటే తమ పార్టీ నేత ఉప్పాల రామ్ ప్రసాద్ చనిపోయారు. భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వెళ్లారు. ఆయన చనిపోయినందుకు చాలా బాధపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా అది ఆయన బాధ్యత అనుకుందాం.. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు – ఘోరాలపై కనీసం దృష్టి పెట్టాలనే ఆలోచన కూడా చేయరా ? . సమాజం అన్నాకా నేరాలు జరగకుండా ఉంటాయా.. అన్నింటినీ పట్టించుకుంటామా అని.. ప్రతీ విషయాన్ని లైట్ తీసుకుంటారా ?’
ప్రజల మాన, ప్రాణాలను కాపాడటం చేతకా ?
ప్రజల మాన, ప్రాణ ఆస్తులను రక్షిస్తానని సీఎం జగన్ ప్రమాణం చేశారు. ఆ విషయాన్ని మార్చిపోయారో ఉల్లంఘించారో కానీ.. ఆయన పార్టీ నేతలు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతూంటే.. పట్టించుకునే దిక్కులేదు. తమ పార్టీ వారు ఏం చేసినా చూసీచూడనట్లుగా పోవాలన్న సంకేతాలు పోలీసులకు వెళ్లాయి కాబట్టి ఈనేరాలు సాగుతున్నాయి. ఘోరాలు జరిగిపోతున్నాయి. ఓ పదేళ్ల పిల్లవాడిని పెట్రోల్ పోసి తగులబెట్టించడం .. ముఖ్యమంత్రి హృదయాన్ని కదిలించదా ?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యలతో విషయం తాగిన ఓ రైతు గురించి … పోలీసుల వల్లే ఇలా చేశారంటూ… కులం పేరు పెట్టి మరీ ట్వీట్ చేసిన ఫైర్ సీఎం అయ్యాక ఎందుకు లేదు ?. తన పార్టీ కార్యకర్తలే ఇష్టారీతిన ప్రజల జీవితానికి భంగం కలిగిస్తూంటే ఎందుకు మాట్లాడటం లేదు.
విశాఖ ఎంపీ కుటుంబాన్ని ఎందుకు పరామర్శిచలేదు ?
విశాఖలో సొంత ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయిందని చెబితే కనీసం పరామర్శించలేదు. పరామర్శించినట్లుగా కూడా చెప్పుకోలేదు. ఆ ఎంపీ.. తాను వ్యతిరేకించే సామాజికవర్గానికి చెందిన వాడనా లేకపోతే… అలాంటివన్నీ సహజమేనని లైట్ తీసుకోవడమా ?. ఎంపీనే పట్టించుకోకపోతే… ఇక సామాన్య కార్యకర్తలను ఏం పట్టించుకుంటారనే సందేహం సహజంగానే వస్తుంది. ఎవర్నీ పట్టించుకోరని … అందరికీ తెలిసిందేనని.. ఎవరికి వారు సర్ది చెప్పుకుంటున్నారు.
ప్రజలను పట్టించుకోని దేశంలో ఏకైక సీఎం !
ఓ విపత్తు జరిగితే వెళ్లరు.. ఓ ఘోరం జరిగిదితే స్పందించరు… బయటకు వెళ్లాలంటే కిలోమీటర్ దూరం పాటు జనం లేకుండా చూసుకుటారు. కానీ.. ప్రజల సొమ్మును మాత్రం సొంత అవసరాలకు ఖర్చు పెట్టుకున్నట్లుగా పెట్టుకోవడానికి మాత్రం వెనుకాడరు. పన్నులు కట్టే ప్రజల మాన ప్రాణాలు పట్టని సీఎం…. దేశంలో ఒకే ఒక్కరే ఉంటారేమో ?