గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ కోడెల శివరాం, కేశినేని నాని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈగోలకు పోయి తాము హైకమాండ్ కంటే బలవంతులం అని.. తమను పిలిచి మాట్లాడలేదని.. టిక్కెట్లు ప్రకటించడం లేదని వారు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేశినేని నాని ఇప్పటికే అన్ని హద్దులు దాటిపోయారు. ఏ పార్టీ నేత కూడా ఆయనను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు కోడెల శివరాంకూడా అదే చేస్తున్నారు. పోటీ చేస్తానంటూ సత్తెనపల్లి నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు.
బ్లూ మీడియాకు అవసరమైన స్టేట్ మెంట్లు ఇవ్వడంలో ఇద్దరు నేతలూ పోటీ పడుతున్నారు. వీరిద్దరికీ ఆ మీడియా నుంచి కావాల్సినంత సపోర్ట్ లభిస్తోంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్ష ప్రసారాలు, వారు చేసే కామెంట్లపై ప్రత్యేక విశ్లేషణలు చేస్తున్నారు . కోడెల అంటే పల్నాడు…పల్నాడు అంటే కోడెల…కాని కోడెల పేరును ఈ గడ్డపై నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగు తున్నాయని అన్నారు….తన తండ్రి తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చేందుకు ఏ స్థాయి వ్యక్తితో అయిన తాను పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నానని కోడెల శివరాం ప్రకటించారు. .తాను పోటీ చేయడం ఖయం..గెలవడం ఖాయమని చెబుతున్నారు.
కోడెల శివరాం వ్యవహారశైలిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉంటే పార్టీ ఖచ్చితంగా ప్రోత్సహించేదని చెబుతున్నారు. కోడెల ఓడిపోవడానికి ప్రధానంగా ఆయన కుమారుడి వ్యవహారశైలే కారణం అని … సత్తెనపల్లిలో ప్రతి ఒక్కరూ చెబుతారు. ఆయనపై సాఫ్ట్ కార్నర్ కూడా లేదు. కోడెలపై ప్రభుత్వం పెట్టిన ఫర్నీచర్ కేసు నిర్వాకం కూడా శివరాందే. ఆయన షోరూం నుంచే ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ వెనక పెట్టుకుని కోడెల శివరాం మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారని అది ఆయనకు మంచిది కాదని పార్టీ వర్గాలు నేరుగానే చెబుతున్నాయి. కానీ ఆయన తనకు బ్లూ మీడియాలో వస్తున్న కవరేజీ చూసి మరింత రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.