తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విపక్షాల భేటీలకు అసలు హాజరు కావడం లేదు. కానీఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు ఇంకా ప్రకటించలేదు కానీ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాత్రం రెండు రోజులకిందట ప్రకటించారు. అసలు బీజేపీకి.. బీఆర్ఎస్కు సంబంధం ఏమిటని… ఆ పార్టీ పట్నా మీటింగ్ కు కూడా వెళ్తోందని చెప్పారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా కేసీఆర్ పట్నా మీటింగ్‌కు వెళ్తున్నారా అని ఆరా తీయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుుంచి క్లారిటీ రాలేదు కానీ.. వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
: పాట్నాలో ఈ నెల 23వ ప్రతిపక్ష నేతల సమావేశం జగనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె నేత ఎంకె స్టాలిన్ కూడా హాజరవుతారు. బిజెపికి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను ఒకేతాటికి తీసుకువచ్చేందుకు, లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు అయింది. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే విపక్ష సదస్సుకు బీజేపీని వ్యతిరేకించేవారంతా రావాలని పిలుపునిస్తున్నారు. స్టాలిన్ సహా పలువురితో గతంలో కేసీఆర్ భేటీ అయ్యారు.
తెలంగాణలో ఇటీవల బీజేపీతో కేసీఆర్ రాజీ తరహా వైఖరి అవలంభించడంతో… బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. గతంలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ ఒప్పందం ఉందని.. రెండూ ఒకేటనన్న ప్రచారం జరగడంతో ఎక్కువగా బీజేపీ నష్టపోతోంది. పార్టీలో చేరేవారులేకపోగా ఉన్నవారు.. కూడా పక్క చూపులు చూస్తున్నారు ఈ క్రమంలో మళ్లీ కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తే.. ఆ పార్టీకి కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది.