వైసీపీలో వి.సా.రెడ్డి పని అయిపోయిది. ఈ విషయాన్ని జగన్ రెడ్డే స్వయంగా ప్రకటించారు . గడప గడపకూ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో సాయన్న ముసలాయన అయిపోయాడని అన్నీ చూసుకోలేకపోతున్నారని.. ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పని చేస్తారని ప్రకటించేశారు. ఇప్పటికే విజయసాయిరెడ్డికి ఏమీ బాధ్యతలు లేవు.. ఆయన చేసేవి చెవిరెడ్డి ఏం చేస్తారంటే అనుబంధ సంఘాల బాధ్యతలు. అంటే.. వీసారెడ్డికి ఇప్పుడు ఉన్న అనుబంధ సంఘాల ఇంచార్జ్ పదవి కూడా చెవిరెడ్డికి జగన్ ఇచ్చేశారన్నమాట.
జగన్ నోట.. విజయసాయిరెడ్డి ముసలాయన అయిపోయారన్న మాట రావడంతోనే అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆయనకు జగన్ రిటైర్మెంట్ ప్రకటించేశారని ఇక పార్టీ వ్యవహారాల్లోనూ ..ఇతర విధాలగానూ.. ఆయనతో సంబంధం ఉండదని స్పష్టమయిందని అంటున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ ఇటీవల విజయసాయిరెడ్డి మళ్లీ కాస్త యాక్టివ్ అవుతున్నారు. పాత పద్దతిలో ట్వీట్లు పెడుతున్నారు. అనుబంధ సంఘాలతో రోజూ సమీక్షలు చేస్తున్నారు. జగన్ మాటల ప్రకారం.. ఇక అవేమీ చేయవద్దని సంకేతాలు ఇచ్చినట్లయింది.
జగన్ అక్రమాస్తుుల కేసుల్లో ఏ 2 విజయసాయిరెడ్డే. అయితే ఆయన కుట్రలో భాగం అయ్యారనే కానీ.. ఆయనఆస్తులు సంపాదించుకున్నారని ఒక్క చోట కూడా సీబీఐ చెప్పలేదు. విజయసాయిరెడ్డి కూడా తాను అసలు లబ్దిదారుడ్ని కాదని కోర్టుల్లో వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఆయనను పార్టీ నుంచి దూరం పెట్టాలని నిర్ణయించుకోవడం ఓ రకంగా సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారన్నది కీలకం.
విజయసాయిరెడ్డి కన్నా పెద్ద వయసు ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వారందరికీ లేని లేని ముసలాయన సర్టిఫికెట్… వి.సా.రెడ్డికే జగన్ ఇచ్చారంటేనే అసలు మతలబు అర్థం చేసుకోవచ్చని వైసీపీలో గుసగుసలు వినినిపిస్తున్నాయి.