ఈనాడు పత్రిక ప్రభుత్వం.. జగన్ అక్రమాలపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు కూడా తీసుకోకుండా… జగన్ రెడ్డి నేరాలు, ఘోరాల్ని ప్రజల ముందు ఉంచడానికి రెడీ అయింది. ఇటీవలి కాలంలో ఏ పత్రిక సర్క్యూలేషన్ పెరగడం లేదు.. కానీ జగన్ రెడ్డి పై ఈనాడు ఎటాక్ తర్వాత ఆ పత్రిక సర్క్యూలేషన్ అనూహ్యంగా పెరుగుతోంది. ప్రజాధనంతో రోజూ లక్షలకుపైగా సాక్షి పేపర్లు కొనిపిస్తున్నా.. . ఈనాడులో సగం కూడా సర్క్యూలేషన్ ఉండటంలేదు. పైగా పెరుగుతోంది.
ఈ కోపంతో ఈనాడును నియంత్రించడానికి మార్గదర్శిపై అదే పనిగా దాడిచేసేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఐపీఎస్ అధికారుల్ని బలి పశువుల్ని చేసి అయినా మార్గదర్శిని ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతున్నారు. కంపెనీని మూసివేయిస్తున్నామని… బ్రాంచుల్ని ఆపేయిస్తున్నామని.. ఆస్తుల్ని అటాచ్ చేశామని. డబ్బుల్ని తిరిగి ఇవ్వలేకపోతోందని ప్రచారం చేస్తున్నారు. అయినా ఒక్క ఖాతాదారుడు కూడా తమ డబ్బుల్ని వెనక్కి ఇవ్వాలని ఆ కంపెనీకి వెళ్లడం లేదు. అయినా సీఐడీ సంజయ్ ను అడ్డం పెట్టుకుని ఊరూవాడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ వాళ్లకు తెలియదో తెలియనట్లు నటిస్తున్నారో కానీ.. అది చిట్ ఫండ్ కంపెనీ. ఇరవై మంది గ్రూప్ ఉంటే… ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి ఇరవై మందికి ఇస్తారు కానీ..కంపెనీ దగ్గర ఉండవు. అందుకే ఎవరూ వచ్చి అడగరు. అయినా మార్గదర్శిని ఏదో చేద్దామని దండయాత్ర చేస్తూనే ఉన్నారు.
అయితే ఈనాడు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్ పై అసలైన దండయాత్ర ప్రారంభించింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి స్కాలో జగన్ చేసిన దందాను మరోసారి గుర్తు చేస్తూ భారీ కథనం రాసింది. అక్కడి ప్రజలను ఎలా మోసం చేశారో వివరించారు. ఆ భూముల్ని ఇప్పటికీ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాలను బయట పెట్టింది. దీంతో వైసీపీ నేతలకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఈనాడు దాడి ఎక్కువ అవుతుందని కంగారు పడుతున్నారు.