ఏపీలో ఉన్న అధికార పార్టీ పేరేమిటి.. అందరూ వైసీపీ అంటారు. కొంత మంది వైఎస్ఆర్ సీపీ అంటారు. కానీ ఈ రెండు పేర్లూ కాదని .. ఆ పార్టీ అధికారికంగా ఈసీకి తెలియచేసింది. తమ పార్టీ పేరుతో యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీగా ప్రకటించుకుంది. అలాగే.. జగన్ తమ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అయ్యారని చేసుకున్న ప్రకటన కూడా అవాస్తవమని ఆ పార్టీనే ఈసీకి తెలిపింది. దీంతో అసలు ఏపీలో ఉన్న అధికార పార్టీ ఏదన్నది కూడా గందరగోళంగా మారింది.
వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారు. తండ్రి పేరు వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. కానీ అది అబద్దం.. అసలు పార్టీ పేరు యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడూ ఆ పార్టీ ఇలా చెప్పుకోదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పుకుంటుంది. కానీ అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో మరో పార్టీ నమోదయింది. ఆ పార్టీ వాళ్లు ఈసీకి ఫిర్యాదు చేస్తే… తమది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని.. యుశ్రారై కాంగ్రెస్ పార్టీ అని తేల్చేసింది.
అలాగే ప్లీనరీలో జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నది కూడా ఉత్తదేనని.. వైసీపీ చెబుతోంది. ప్లీనరీలో విజయసాయిరెడ్డి అందరి ముందు ప్రకటన చేయడం చూశారు. సజ్జల రెడ్డి అడ్డగోలుగా సమర్థించుకోవడం కూడా చూశారు. తీర్మానం ఆమోదించుకున్నారు. అయినా అబ్బే అలాంటిదేమీ లేదని … ఈసీకి సమాచారం ఇచ్చారు. మొత్తంగా తమ పార్టీ చేసే పనుల్ని చెప్పుకోవడానికి కూడా వైసీపీ సిగ్గుపడే స్థాయికి వెళ్లిపోయింది.