విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక. ‘సీతారామం’తో మంచి పేరు తెచ్చుకొన్న మృణాల్ కి దొరికిన మరో మంచి అవకాశం ఉంది. విజయ్ – మృణాల్ ల జోడీ కూడా చూడ్డానికి బాగానే ఉంది. వీళ్ల కెమిస్ట్రీ వెండి తెరపై ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రంలో మృణాల్… డాక్యుమెంటరీ డైరెక్టర్‌గా కనిపించబోతోందని సమాచారం. ఓ డాక్యుమెంటరీ పని మీద అమెరికా నుంచి.. ఇండియా వస్తుంది హీరోయిన్. ఇక్కడ హీరోకీ, హీరోయిన్‌కీ పరిచయం అవుతుంది. అక్కడి నుంచి.. వీళ్ల లవ్ స్టోరీ మొదలవుతుంది. హీరో క్యారెక్టర్ ఏమో… నిరుద్యోగి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ, అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. వీరిద్దరి ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రానికి ‘కుటుంబరావు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే హీరోకి.. తన లవ్ స్టోరీకీ మధ్య ఉండే స్ట్రగుల్ ఈ సినిమా అని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.