ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నప్పుడు తన చాంబర్లోకి కాపులకు ప్రవేశం లేదని డైరక్ట్ గా బోర్డు పెట్టారు. అలాంటి నేత తర్వాతి కాలంలో కాపు రిజర్వేషన్లు.. మా జాతి అంటూ కొత్త ఉద్యమం లేవనెత్తారు. కానీ ఆయనను ఎవరూ నమ్మలేదు.ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గట్టిగా పది వేల ఓట్లు కూడా రాలేదు. కానీ కాపు వర్గంలో కొంత పలుకుబడి సంపాదించారు. ఇప్పుడు ఒక్క లేఖతో అది మొత్తం పోగొట్టుకున్నారు.
కాపులను ఘోరంగా కించపర్చినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న ద్వారంపూడికి మద్దతుగా.. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ.. ఆయన లేఖ రాయడం.. అందులో భాష గురించి మాట్లాడటం సంచలనంగా మారింది. కాపు బిడ్డలను..మహిళలను ద్వారంపూడి అమ్మనాబూతులు తిట్టారు. అప్పుడు లేని భాష.. ప్రజాస్వామ్య పద్దతిలో మాట్లాడుతున్న పవన్ విషయంలో అభ్యంతరం అయిందా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఫండింగ్ చేశారని చెప్పడం కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ వెంట ఉద్యమంలో తాము కూడా నడిచి ఉప్మా తిన్నామని అది ద్వారంపూడి స్పాన్సర్ షిప్ అని తెలియదని..అందుకే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి.. రూ. వెయ్యి చొప్పున మనీయార్డర్లు పంపుతున్నారు.
కాపు సంఘాలు.. నేతలు.. ఇప్పుడు ముద్రగడపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. కాపు కులద్రోహి అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిజానికి కాపులను చీల్చి ముద్రగడ వంటి వారు.. రాజకీయ పార్టీలకు కులాన్ని తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ నిలబడినా.. కనీసం కుల మద్దతు కూడా ఆయనకు దక్కడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.