ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఎందుకు గెలిచారో… మళ్లీ గెలవడానికి ఆయన ఏం చేస్తున్నారో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక స్వరాజ్య లో ఓ విశ్లేషణ చేశారు. ఆరెస్సెస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ అయినప్పటికీ స్వరాజ్య వంటి పత్రికలు ఆరెస్సెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూంటాయి. ఈ పత్రికలో జగన్ రెడ్డి క్రిస్టియన్లు ముఖ్యంగా కన్వర్టడ్ క్రిస్టియన్లను పెంచకుుని వారిని ఓటు బ్యాంక్ గా చేసుకుని గెలుస్తున్నారన్న విషయాన్ని వెల్లడించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ల జనాభా ఒక్క శాతం మాత్రమే. అది అధికారికంగా . కానీ దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఏపిలో క్రిస్టియన్ల సంఖ్య కనీసం ఐదో వంతు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఏపిలో ప్రతి 18 గ్రామాలకి ఒక పెద్ద చర్చి ఉంది. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అనే సంస్థ మతం మారినా దళితులుగానే నమోదు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు దళితులుగా కొనసాగితేనే లభిస్తాయి. మతం మార్చుకుంటే వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల మతం మారినా అనేక మంది దళితులుగానే కొనసాగుతున్నారు.
వీరుకాక, ఇతర కులాల నుంచి, మతాల నుంచి మత మార్పిడి చేసుకున్న వారు కూడా ఉన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య ఇరవై శాతం పైనే ఉంటుందని ఇదే జగన్ విజయరహస్యమని స్వరాజ్య పత్రిక చెబుతోంది. ఒక్క క్రిస్టియన్ కాకుండా ముస్లిం ఇతర వర్గాలను కూడా కలుపుకుంటే.. హిందువులు మైనార్టీలోకి వెళ్లిపోతున్నారన్న అభిప్రాయాన్ని స్వరాజ్య వ్యక్తం చేసింది. ఏపీలో గత నాలుగేళ్లలో రాజకీయ లక్ష్యంతోనే పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అనేక మంది కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మత మార్పిళ్లను ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. గిరిజనులు అసలు క్రైస్తవులు కాదు.కానీ ఇప్పుడు అత్యధిక మంది క్రైస్తవులు అయ్యారు. దళితుల్లో చెప్పాల్సిన పని లేదు. గత నాలుగేళ్లుగా బీసీ కులాలపైనా పడ్డట్లుగా అనుమానాలున్నాయి. ఈ క్రమంలో ఈనాశ్య రాష్ట్రాల మాదిరిగా ఏపీ కూడ క్రిస్టియన్ మెజార్టీ రాష్ట్రంగా మారిపోయినా ఆశ్చర్యం లేదన్నది ఆర్సెస్సెస్ ఆందోళనగా చెబుతున్నారు.