తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానుండటం కీలక పరిణామంగా మారింది,. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్.. తర్వాత పూర్తిగా సైలెంట్ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ఆగిపోవడం… కేసీఆర్, కేటీఆర్ సైలెంట్ కావడం రెండూ ఒక్కసారే జరిగాయి. దీంతో ఆ రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం ఊపందుకుంది.
అలా ప్రచారం ప్రారంభమయినప్పటి నుండి తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయింది. ఆ పార్టీలో చేరాలనుకున్న వారు ఆగిపోయారు. ఉన్న వారు కూడా వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. అయినా హైకమాండ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో తెలంగాణ బీజేపీ నేతలు షాక్ కు గురవుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని.. కేసీఆర్ అభ్యర్థుల్ని కూడా ఖరారు చేస్తున్నారని బండి సంజయ్ అంటున్నారు. బండి సంజయ్ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు.
బీజేపీకి వచ్చిన హైప్ అనూహ్యంగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో వారికి తెలియడం లేదు. ఓ వైపు హైకమాండ్ లైట్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాల్సింది పోయి.. మిత్రపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మరింతగా సీన్ మారుతుందని అంచనా వేస్తున్నారు.