షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ ను చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ షర్మిల మాత్రం తాను ఏపీకి వెళ్లేది లేదని..తాను తెలంగాణ బిడ్డనని.. తుది శ్వాస వరకూ తెలంగాణలో రాజకీయం చేస్తానని కొట్లాడుతానని అంటున్నారు. రెండు రోజులుగా విలీనం ప్రచారం ఎక్కువ కావడం. .. ఏపీలోనూ షర్మిల రాకపై కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.
కాంగ్రెస్ లో విలీనాన్ని మాట మాత్రం గా కూడా ఖండించలేదు కానీ.. తాను మాత్రం తెలంగాణ వదిలి పోనని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా తెలంగాణ సీనియర్లు అంతా .. ఆమె తెలంగాణలో అవసరం లేదని.. ఆమె పార్టీ విలీనానికి ఓకే కానీ తెలంగాణలో మాత్రం ఆమె అసలు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయవద్దని అంటన్నారు. హైకమాండ్ ఆలోచన కూడా అదే. అయితే షర్మిల తరపున కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంచాలనుకుంటున్నారు.
కుటుంబ ఒప్పందాలో..మరో కారణమో కానీ.. షర్మిల ఏపీలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ కాంగ్రెస్ లో విలీనానికి ఆసక్తిగా ఉన్నారు. అసలు ప్రతిపాదన కూడా ఆమె వైపు నుంచే వెళ్లింది. కాంగ్రెస్ అందుకే వినూత్నంగా ఆలోచించి.. విలీనానికి ఓకే కానీ..ఏపీకి వెళ్లాలని అంటోంది. షర్మిల ఏపీకి వెళ్లకపోతే.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి పెద్దప్లాన్ తోనే రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారని అందరికీ డౌట్ వస్తుంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటు వైసీపీదే అవుతుంది. అది జగన్ కు తీవ్ర నష్టం చేస్తుంది.