గుంటూరు కారం టీమ్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. పూజా మెయిన్ హీరోయిన్. సెకండ్ ప్లేస్ శ్రీలీలకు దక్కింది. ఇప్పుడు పూజా ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు వెళ్లిపోయింది. సో.. మెయిన్ హీరోయిన్ ప్లేస్ శ్రీలీలకు దక్కింది. ఇప్పుడు శ్రీలీల ప్లేస్‌లో మీనాక్షీ చౌదరి వచ్చి చేరింది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడీ, హిట్ 2 చిత్రాలతో ఆకట్టుకొంది మీనాక్షీ చౌదరి. మహేష్ హైట్కీ, పర్సనాలిటీకీ కరెక్ట్ మ్యాచ్ అని చిత్రబృందం భావించింది. పూజా హెగ్డే ప్లేసులో సంయుక్త మీనన్‌ని తీసుకోవాలని ముందు భావించినా, మహేష్ పక్కన సంయుక్త అంతగా నప్పదన్న ఫీలింగ్‌తో చివరి నిమిషంలో… మీనాక్షీ చౌదరి ని రంగంలోకి దింపారు. తమన్ ని సైతం పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చినా.. ఇటు చిత్ర బృందంగానీ, అటు తమన్ గానీ అధికారికంగా ఏం మాట్లాడడం లేదు. తమన్ మాత్రం సెటైరికల్‌గా ట్వీట్లు చేస్తున్నాడు. తమన్ స్థానంపై కూడా అతి త్వరలోనే ఓ ప్రకటన రావొచ్చు.