విజయశాంతి ఏదైనా పార్టీలో చేరుతారు కానీ పెద్దగా కనిపించరు. చేరినప్పుడు ప్రకనటలు వస్తాయి. తర్వాత సైలెంట్ అవుతారు . మళ్లీ ఎన్నికలకు ముందు కనిపిస్తారు. ఏ పార్టీ ఊపులో ఉందో చూసుకుని ఆ పార్టీలో చేరిపోతారు. చివరికి ఆ పార్టీ పరిస్థితి తలకిందులు అవుతుంది . ఇప్పుడు ఆమె ఉన్న బీజేపీలోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో ఆమె కంగారు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటీవల దాదాపుగా ప్రతీ రోజూ ఆమె బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారన్న .. దాని పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వెళ్లే వాళ్లు ఎవరు వెళ్లినా.. పార్టీకి ఏమీ కాదని చెబుతున్నారు. ఆమె ప్రకటనలు కాస్తంత విచిత్రంగా ఉండటంతో.. కాంగ్రెస్ నుంచి తనకు పిలుపు రాలేదన్న కారణంగా తాను కూడా ఉన్నానని గుర్తు చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
బీజేపీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్ పని అయిపోయిందని.. అక్కడ ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి ఉన్నా వదిలేసుకుని బీజేపీలో వచ్చి చేరితే ఏ చిన్న పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు ఊపొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆమె అక్కడే ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నారు. పాత కాంగ్రెస్ నేతలు చాలా మందిని మళ్లీ చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. విజయశాంతికి మాత్రం ఎలాంటి పిలుపు వెళ్లడం లేదు. దీంతో విజయశాంతి.. బీజేపీపై అతి ప్రేమాభిమానాలు చూపిస్తూ పోస్టులు పెడుతూ ప్రకటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ లోకి వచ్చేయమని ఎవరైనా పిలిస్తే.. ఎలా స్పందిస్తారో కానీ.. ఇప్పటికైతే ఆమె తెలంగాణ రాజకీయాల్లో తాను కూడా ఉన్నానని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.