సోషల్ మీడియా అంటే వ్యతిరేకులపై మార్ఫింగ్లు చేయడం.. బూతుల యుద్ధం చేయడం అన్నట్లుగా మారిపోయింది వైసీపీకి. సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి వెళ్లిన తర్వాత పరిస్థితి ఘోరంగా మారింది. ఈ వారాంతలో సజ్జల భార్గవ్ రెడ్డి తన సోషల్ మీడియా కాలకేయులకు ఓ టాస్క్ ఇచ్చారు. స్వాతిరెడ్డి అనే టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై బూతుల యుద్ధం ప్రకటించారు. ఆమెపై మార్ఫింగ్లతో విరుచుకుడ్డారు. ప్రజాపక్షం అనే పత్రికలో వార్త వచ్చిందని మార్ఫింగ్ ఫోటో పెట్టారు. లండన్ లో ఉండే ఆమె ఫోన్ నెంబర్ కు వందల కాల్స్ చేసి వేధించడం ప్రారంభించారు. ఈ విషయాలన్నీ స్వాతిరెడ్డి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె కూడా వైఎస్ భారతిపై వచ్చిన కొన్ని మార్ఫింగ్లను పోస్ట్ చేశారు.
తనకు ఫోన్ చేస్తున్న వారి కాల్ లిస్ట్ ను బయట పెట్టారు. అయితే వైసీపీ సోషల్ మీడియా అనుకున్నట్లుగా ఆమె భయపడిపనట్లుగా లేదు రివర్స్ లో ఎటాక్ చేస్తూనే ఉన్నారు. స్వాతి రెడ్డిలండన్ లో ఉంటారు. టీడీపీ తరపున యాక్టివ్ గా పోస్టులు పెడుతూ ఉంటారు. రెడ్డి అని పెట్టుకోవడంతో ఆమె ఫేక్ అని అనుకుంటూ ఉంటారు . కానీ ఆమె వివరాలన్నీ తెలియడంతో ఆమె నిజంగానే స్వాతిరెడ్డి అని స్పష్టమయింది. ఆమె నేరుగానే తన విమర్శలను ఎక్కు పెడుతూంటారు. జగన్ విధానాలపైనే విమర్శలు చేస్తూంటారు. ఎక్కడా గీత దాటినట్లుగా ఉండరు.
కానీ ఆమెను సైలెంట్ చేయడానికి ఒక వారాంతం మొత్తం వైసీపీ సోషల్ మీడియా కేటాయించడంతో ఆమె ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. పోస్టులు పెట్టడం వేరు నేరుగా ఫోన్ చేసి వేధించడం వేరు. ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి.. ఇలా వందల కొద్దీ కాల్స్ చేసి వేధిస్తున్నారు. తనను ఎవరు వేధించినా ఆమే నేరుగా జగన్, సజ్జల భార్గవనే టార్గెట్ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… వైసీపీ వాళ్లు చేసే ట్రోలింగ్ , మార్ఫింగ్ పోస్టుల కన్నా.. స్వాతిరెడ్డి పోస్టులకే రీచ్ ఎక్కువ వస్తోంది.