మీరంటే ఓ ఇది ఓ అది.. అని కలెక్టర్లు పొగుడుతారు. అసలు సమావేశం ఏమిటో ఎవరూ పట్టించుకోరు. ఓ బటన్ నొక్కుడు ప్రోగ్రాం కు వర్చవల్ గా ప్లాన్ చేశారంటే.. అన్ని జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ కు పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకరు జగన్ భజన చేస్తారు. జగన్ బటన్ నొక్కి.. తనకు ఇచ్చి న స్క్రిప్టును చూసి చదువుతారు. అంతే ఆ సమావేశం క్లోజ్. ఇదేనా పాలన అని చూసేవాళ్లకు ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అదే పాలన.. కలెక్టర్లతో పాటు లబ్దిదారుల పేరుతో తీసుకొచ్చే కొంత మంది పని కూడా పొగడటమే.
సీఎం జగన్ పొగిడితేనే ఏమైనా చేస్తారని.. లేకపోతే దగ్గరకు కూడా రానివ్వరని అందుకే పొగిడానని ఉద్యోగుల సంగం నేత బండి శ్రీనివాసరావు.. తన సంఘానికి చెప్పుకున్నారు. ఉద్యోగాలంతా గల్లా పట్టుకునే పరిస్థితి రావడంతో ఇలా చెప్పుకున్నారు. ఏ సమస్యలు పరిష్కరించకపోయినా.. కేసుల పేరుతో ఉద్యోగ సంఘాల నేతల్ని దారికి తెచ్చుకున్నారని అందరికీ తెలుసు. సూర్యనారాయణలా తాము కూడ పారిపోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండటానికి ఉద్యోగ నేతలు జగన్ భజన ఎంచుకుని బయటపడ్డారు.
అసెంబ్లీ జరిగితే జగన్ ను పొగడటం.. సభలు జరిగినా అంతే. ఏపీలో ఎలాంటి కార్యక్రమం అయినా జగన్ ను పొగడటమే పని. పొగిడితే బతికిపోతారు.. పొగడకపోతే చచ్చారే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయి. ఇదే పాలన అన్నట్లుగా ఉండటంతో.. పొగిడి బయటకు వచ్చిన వారంతా… పులకేశి పాలన అని సెటైర్లు వేసుకుంటున్నారు.