తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మూడున్నర గంటల పాటు కాపు రిటైర్డ్ ఉన్నతాధికారులకు విందు ఇచ్చారు. ఇటీవల బీజేపీ నేతలు కొంత మంది కాపు రిటైర్డ్ అధికారులతో సమావేశం అయ్యారు. వీరెవరూ తెలంగాణలో తెలిసిన వారు కాదు. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీస్ సాధించి… ఇతర రాష్ట్రాలక్యాడర్ లో పని చేసి రిటైరైన వాళ్లు. అందర్నీ సమీకరించి సమావేశం పెట్టారు. ఇది తెలిసి కేసీఆర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో రిటైరైన వారిని తోట చంద్రశేఖర్ ద్వారా సమీకరించారు. చాలా మంది వచ్చారు. వారందర్నీప్రగతి భవన్ కు ఆహ్వానించి విందు ఇచ్చారు.
కేసీఆర్ టార్గెట్ బీజేపీకి కౌంటర్ ఇవ్వడం.. మున్నూరుకాపు ఓట్లను తన ఖాతాలో వేసుకోవడం. ప్రస్తుతం మున్నూరుకాపు ఓట్లు బీఆర్ఎస్ కు దూరమయ్యాయి. ఆ వర్గం తరపున బండి సంజయ్ బీజేపీ నేతగా ఉన్నారు. కేసీఆర్ ఇటీవలతీసుకున్న రాజకీయ నిర్ణయాలు బీఆర్ఎస్ కు మున్నూరు కాపుల్ని దూరం చేశాయి. దగ్గర కు తీసుకునేందుకు వద్దిరాజు రవిచంద్రకు కొంత కాలం ఉన్న రాజ్యసభ పదవి ఇచ్చారు. అయితే వీటితో చల్లారే పరిస్థితి లేదు. అందుకే ఏకంగా సీఎస్ పదవినే కాపు వర్గానికి ఇచ్చి ప్రచారం చేసుకుటున్నారు.
అయితే ఏపీలో కాపు వర్గాన్ని జనసేనకు దూరం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తోట చంద్రశేఖర్ ను అందుకే ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా చేశారని అంటున్నారు . అయితే ఆ తర్వాత ఆయన పెద్దగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు. కనీసం పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి కూడా వెళ్లలేదు. కానీ మహరాష్ట్రకు మాత్రం పదే పదే వెళ్తున్నారు. అయితే తెర వెనుక కాపుల ఓట్లలో చీలిక తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది.