పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నారు హరీష్ శంకర్. ఈ సినిమా ‘తెరి’ కి రీమేక్ అని ప్రచారం జరిగింది. ‘మళ్ళీ రీమేక్ ఏమిటి ? సొంత కథతో సినిమా చేయొచ్చుకదా ?” అని పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఐతే హరీష్ మాత్రం రీమేక్ వార్తలని తోసిపుచ్చినట్లు మాట్లాడారు. రీమేక్ కాదు ఒరిజినల్ సినిమా చూపిస్తా అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న విడుదల చేసిన టీజర్ కూడా కాస్త కొత్తగా వుండటంతో ఫ్యాన్స్ కూడా ఇది సొంత కథే అనుకున్నారు.
ఐతే ఇప్పుడు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా చేస్తున్న దశరధ్.. ఉస్తాద్ కథ గుట్టు విప్పేశారు. ఉస్తాద్ 90 శాతం స్ట్రయిట్ గా ఉంటుదని చెప్పుకొచ్చారు. ”హరీష్ చేసిన గబ్బర్ సింగ్, గద్దల కొండ రీమేక్స్ కూడా యధావిధిగా వుండవు. తన స్టయిల్ లోకి పూర్తిగా మార్చేసి ప్రజంట్ చేస్తాడు. ఉస్తాద్ లో కూడా ఆ ఒరిజినాలిటీ చూస్తారు. ఉస్తాద్ 90 శాతం స్ట్రయిట్ గా వుంటుంది” అని చెప్పుకొచ్చారు. దశరధ్ ఇచ్చిన 90 శాతం స్ట్రయిట్ అనే స్టేట్మెంట్ తో ఉస్తాద్ రీమేక్ అనే సంగతి తేలిపోయింది.