కథ …స్క్రీన్ ప్లే.. దర్శకత్వం అప్పల్రాజు సినిమలో కృష్ణ భవనాన్ క్యారెక్టర్ బటన్ నొక్కడమే. మాట కంటే ముందు బటన్ నొక్కుతూ ఉంటాడు. ఓ సారి అసలు ఆ బటన్ నొక్కుడులో ఏముందా అని సునీల్ ఆతృతగా చూస్తే.. అది షట్ డౌన్ అయిన కంప్యూటర్. ఇప్పుడు సీఎం జగన్ నొక్కుతున్న బటన్లు కూడా అంతేలా ఉన్నాయి. షట్ డౌన్ అయిన కంప్యూటర్ బటన్లను ఆయన నొక్కుతున్నారు. వర్జినల్ బటన్ అయితే.. అది నొక్కగానే అందరి అకౌంట్లలో డబ్బులు పడిపోవాలి. కానీ పడటం లేదు. పడవని సీఎం జగన్ అదే వేదికపై నుంచి చెబుతున్నారు.
పది రోజుల పాటు అమ్మఒడి సంబరాలు జరుగుతాయని అంటున్నారు. అంటే పది రోజుల్లో ఎప్పుడైనా పడొచ్చని చెబుతున్నారు. అంత మాత్రం దానికి కోట్లు పెట్టి ప్రకటనలు.. బహిరంగ సభ పెట్టి బటన్ నొకకుతున్నట్లుగా నటించడమెందుకని చాలా మందికి వస్తున్న డౌట్. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుబంధు నిధులని జమ చేస్తోంది. ఎక్కడా వందలకోట్లు పెట్టి ప్రకటనలు ఇవ్వలేదు. కేసీఆర్ బటన్ నొక్కలేదు. కానీ ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు పడుతున్నాయి. కానీ జగన్ బటన్ నొక్కినా పడకపోవడం ఏపీలో విచిత్రం.
అమ్మఒడికి పదిహేను వేలిస్తున్నామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు.కానీ ఇచ్చేది పదమూడు వేలే. గతంలో ల్యాప్ ట్యాప్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పారు..ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామన్నారు. చివరికి పదమూడు వేలతో సరిపెట్టారు. రైతు భరోసాను పన్నెండున్నర వేల నుంచి ఏడున్నర వేలు చేశారు. వచ్చే పది రోజుల్లో ఏది తాకట్టు పెట్టే ప్లాన్ ఉందో కానీ.. సర్దుబాటు చేయగలమని.. పది రోజులు గడువు పెట్టుకున్నట్లుగా భావిస్తున్నారు.