ఓ ముఖ్యమంత్రిపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఆయన తీసుకునే నిర్ణయాలకు వచ్చే ప్రజాస్పందన బట్టి అర్థమైపోతుంది. ప్రస్తుత సీఎం జగన్ రెడ్డిపై ప్రజా నమ్మకం ఎలా ఉందో జగనన్న టౌన్ షిప్ అని ఆయన పెట్టిన పథకంకు వచ్చిన స్పందనను పట్టి చూద్దాం. జగనన్న టౌన్ షిప్ అంటే.. మధ్య ఆదాయ వర్గాల కోసం అన్ని ఎమినీటీస్ తో అంటే రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ ఇలా అన్నీ కల్పించి… మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఇస్తామని తెచ్చిన పథకం. రియల్ ఎస్టేట్ డెలవపర్ లా ఆలోచించి తెచ్చిన ఈ పథకానికి భూములు సేకరించి ప్లాట్లు వేశారు.
దాదాపుగా రాష్ట్రం మొత్తం వేశారు. వేయడం అంటే… రోడ్లు, డ్రైనేజీ, కరెంంట్ పోల్స్ కాదు.. ఊరకనే వెంచర్ ప్రకటన చేశారు. అమ్మకానికి పెట్టేశారు. జగన్ ను నమ్మి ఓటు వేశాం ఇంకా డబ్బులు కూడా పోగొట్టుకోవాలా అని ఆ పార్టీ సానుభూతిపరులు కూడా ఆ వెంచర్లలో ఫ్లాట్లు కొనుక్కునేందుకు మందుకు రాలేదు. కొన్ని వేల ఫ్లాట్లు వేస్తే.. వందల్లో కూడా దరఖాస్తు చేసుకోలేదు. చేసుకున్న వారు కూడా ఇప్పుడు మీకో దండం బాసు.. కట్టిన కిస్తీలు వెనక్కి ఇచ్చేయాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ టౌన్ షిప్పుల పథకం కాస్త డబ్బులు కట్టిన వాళ్లకు చిప్పగా మారింది.
నిజానికి ప్రభుత్వం అమ్మే స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తులు రూపాయి ఎక్కువైనా పోటీ పడతారు. ఎందకంటే క్లియర్ టైటిల్ ఉంటుంది. గత ప్రభుత్వం… సీఆర్డీఏ తరపున హ్యాపీ నెస్ట్ కడతామంటే.. గంటలో పూర్తి అమౌంట్ కట్టడానికి వందల మంది రెడీ అయిపోయారు. కానీ ఈ ప్రభుత్వం స్థలాలిస్తామంటేనే ఎవరూ రావడం లేదు. ప్రజలకు పాలకులపై నమ్మకం ఉండాలి… మోసం చేస్తాడనే ముద్ర కాదని ఇలాంటి పథకాలు ఫెయిల్ అయినప్పుడు అయినా పాలకులు ఎందుకు మారరో మరి !