దేశంలో గవర్నర్లు రెండురకాలుగా ఉంటారు. బీజేపీ పాలిత, బీజేపీ సామంత రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్ భవన్ లో … మాకేమీ కనిపించదు… మాకేమీ వినిపించదు… మాకు అధికారాలు స్వల్పం అని సైలెంట్ గా ఉంటారు. అదే బీజేపీయేతర రాష్ట్రాల్లో అయితే…. ఏకంగా మంత్రుల్ని కూడా అసాధారణంగా తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే రాజ్యాంగాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చుకుంటూ ఉంటారన్నమాట. తమిళనాడులో మంత్రి సెంధిల్ బాలాజీపై ఈడీ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనను తొలగించాలని గవర్నర్ పట్టుబడుతున్నారు.
సెంధిల్ బాలాజీపై తప్పుడు కేసులు పెట్టారని… స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదంటున్నారు. నేరుగా గవర్నర్ రంగంలోకి దిగి ఆయనను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. స్టాలిన్ వాటిని చెత్తబుట్టలో వేశారు. ఇప్పుడు తానే తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాజ్యాంగంలో బేసిక్స్ తెలిసిన ఎవరైనా… గవర్నర్ తనంతటకు తానుగా మంత్రిని చేర్చడం.. తీసేయడం చేయలేరు. ఏదైనా సీఎం సిఫారసు మేరకే జరగాలి. ఉత్తర్వులిచ్చాక.. ఎవరైనా పదో తరగతి స్టూడెంట్ రాజ్యాంగంలో ఇలా ఉందని గవర్నర్ కు చెప్పారేమో కానీ న్యాయసలహా కోసం ఉత్తర్వుల్ని ఆపేస్తున్నానని కాసేపటికి మరోసారి ప్రకటింంచారు.
తమిళనాడుగవర్నర్ వ్యవహరశైలి .. రాజ్యాంగాన్ని ధిక్కరించిన వైనం సంచలనంగా మారుతోంది. నిజంగా అదే నిజం అయితే… ఎడాపెడా ఈడీ కేసులు..సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ రెడ్డిని ఇక్కడి గవర్నర్ ఎంందుకు సహిస్తున్ారు ? పైగా ఏపీ గవర్నర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అక్కడి గవర్నర్ కు ఉన్న అభ్యంతరాలు ఇక్కడి గవర్నర్ కు ఎందుకు లేవు ? . అంతా ప్రజాస్వామ్యం… రాజ్యంగం పేరుతో చేసే రాజకీయ పార్టీల మాయ అనుకోక తప్పదు.