మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సారి తనకు టిక్కెట్ లేదన్న సంకేతాలు కనిపిస్తూండటంతో కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. టీడీపీ నేతలో సవాళ్లు చేస్తున్నరు. దమ్ముంటే నాపై గెలవాలని సవాళ్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై అలాగే సవాల్ చేశారు. తర్వాత ఆనం కుటుంబంపైనా అదే చేశారు. ఇప్పుడు నెల్లూరు సిటీ టీడీపీ ఇంచార్జ్ గా మాజీ మంత్రి పొంగూరు నారాయణను ప్రకటించడంతో ఆయనపైనా అదే చేస్తున్నారు. దమ్ముంటే నాపై గెలవాలని..ఆయన నూట యాభై కోట్లు ఖర్చుపెట్టుకుని నష్టపోతారని ప్రకటనలు చేసేస్తున్నారు.
అనిల్ కుమార్ ప్రకటనలు చూసిన వైసీపీ నేలు.. పాపం అనుకుంటున్నారు. అసలు టిక్కెట్ లేదనే సంకేతాలు జగన్ చాలా స్పష్టంగానే పంపినా ఎందుకు అనిల్ ఇంత ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. తానే అభ్యర్థినని.. మరో మాట లేదని చెప్పుకోడానికి ఆయన పడుతున్న తంటాలు అని.. కానీ జగన్ ఎప్పుడో ఆయన టిక్కెట్ చింపేశారని అంటున్నారు. ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కు ఇతర వైసీపీ నేతల మద్దతు ఉంది.
మంత్రి పదవి రావడం అనిల్ కు మైనస్ అయింది. ఆయన వ్యవహారశైలి కారణంగా అందరూ దూరమయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన ఆనం ఫ్యామిలీని నానితిట్లు తిట్టారు. ఇలా చేసినా చివరికి సొంత వాళ్లే దూరమయ్యారు. ఇప్పుడు తాను.. తన రేంజ్ అంటూ మాట్లాడుకుంటూ.. టిక్కెట్ కోసం… ఇతర పార్టీ నేతలకు చాలెంజ్లతో ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి వర్కవుట్ అవుతుందో లేదో మరి !