భారతీయ జనతా పార్టీ .. జనసేన, టీడీపీతో కలిసే చాన్స్ ఉందని ప్రచారం ప్రారంభం అయిన తర్వాత జగన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. రెండు సార్లు కూడా ఈటీజీ అనే ఊరూపేరూ వ్యవస్థ లేని సంస్థ పేరుతో టైమ్స్ నౌ నవభారత్ అనే హిందీ చానల్లో సర్వేలు వేయించారు. ఏపీలో అసలు ఇతర పార్టీలకు పార్లమెంట్ సీట్లేమి రావని అన్నీ వైసీపీకే సవస్తాయని ఆ సర్వేల సారాంశం. ఈ సర్వేను చూసి వైసీపీ నేతలే పగలబడి నవ్వుకున్నారు. మరి బీజేపీ పెద్దలు నవ్వుకోరా ?
బీజేపీ .. టీడీపీ వైపు చూడకుండా ట్యూన్ చేసే ప్రయత్నంలో జగన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ, జనసేన కూటమి వైపు చూడకూడదనేదే జగన్ రెడ్డి ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడే ఒకటి రెండు చానల్స్ సర్వేలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సర్వే వివరాలను చూపించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా టీడీపీకి పార్లమెంట్ సీట్లేమీ ఉండవని.. ఆ పార్టీతో వెళ్లడం వేస్ట్ అని.. తమ పార్టీకే బోలెజన్ని సీట్లు ఉంటాయని వారిని నిమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి సర్వేల్ని బీజేపీ ఎన్ని చూసి ఉంటుంది !
అయితే అసలు ఇలాంటి సర్వేల లోగుట్టేమిటో ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. ఎవరు ఎంతకు సర్వేలు అమ్ముకుంటారో కూడా తెలుసు. బీజేపీకి.. బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉంటుందా.? ఇలాంటి సర్వేలు వేసినంత మాత్రాన.. బీజేపీ పెద్దలు నమ్మేస్తారా ?. జాతీయ మీడియా మొత్తం బీజేపీ గుప్పిట్లో ఉంటుంది. ఆదాయం కోసం… డబ్బు కోసం ఇలాంటి చానళ్లు ఎలాంటి సర్వేలు వేస్తారో వారికి తెలుసు. నమ్ముతారని జగన్ రెడ్డి అనుకుంటే… అంత కంటే అమాయకత్వం ఉండదని ఎవరైనా అనుకోవడం సహజం.
ప్రతి సారి ఢిల్లీ పర్యటన ఉన్నప్పుడే సర్వేలే అసలు కిటుకు !
జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే ప్లాన్ రెడీ అయినప్పుడే ఎజెండా ప్రకారం కొన్ని వ్యవహారాలను సర్దుబాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో… బీజేపీ ఒంటరిగానే ఉండాలని ఉంచాలన్న లక్ష్యంతోనే ఢిల్లీ వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. తమకు దూరం అయితే కష్టాలేనని హెచ్చరించనున్నట్లుగా చెబుతున్నారు. ఇదే నిజం అయితే జగన్ రెడ్డి కూపస్థమండూకంలా అలోచిస్తున్నారని బీజేపీ సముద్రాన్ని ఈదుతుందనే సంగతిని గుర్తుంచుకోవాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.