రాజకీయ పార్టీల హామీలను ప్రజలు నమ్మడం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు కొత్తగా గ్యారంటీ అనే పదం ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు మొదటగా ఈ గ్యారంటీని రాజకీయాల్లోకి తెచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు గ్యారంటీని చేర్చారు. రాష్ట్ర నేతలు ప్రకటించడం…రాహుల్, ప్రియాంక వంటి వాళ్లు వచ్చి.. తాము గ్యారంటీ అని చెప్పడం ప్రారంభించారు. ఇది ప్రజల మనసుల్లోకి వెళ్లిందని ఓట్ల పంట పండించిందని అన్ని రాజకీయ పార్టీలూ ఓ అంచనాకు వచ్చాయి.
తెలంగాణలోనూ కాంగ్రెస్ గ్యారంటీ మంత్రం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీ మాత్రం పాటిస్తోంది. డిక్లరేషన్లో ప్రకటించినా హామీలన్నింటినీ అమలు చేస్తామని.. రాహుల్ గ్యరంటీ ఇస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చినట్లుగాగానే కాంగ్రెస్ పార్టీ తమ తెలంగాణ మేనిఫెస్టోలో… గ్యారంటీకి ప్రాధాన్యం ఇవ్వబోతోంది ఈ విషయంలో సునీల్ కనుగోలు మరింత గ్యారంటీగా ప్రజల్లోకి మేనిఫెస్టోను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
ముందే పట్టుకున్న చంద్రబాబు !
పొలిటికల్ ట్రెండ్స్ ను అంచనా వేసి వాటిని వెంటనే తన పార్టీకి అప్లయ్ చేయడంలో ముందుండే టీడీపీ అధినేత చంద్రబాబు.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ ప్రజలపై విశేషమైన ప్రభావం చూపిందని అర్థమైన వెంటనే… తన మేనిఫెస్టోకు భవిష్యత్ కు గ్యారంటీ అని పేరు పెట్టేశారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయామం వంటి హామీలన్ని తాను కూడా ఇచ్చారు. కర్ణాటక మేనిఫెస్టోను కాపీ కొట్టారని జగన్ విమర్శలు చేసినా… మంచి చేయడానికి ఎక్కడివైతే ఏంటని… అమలు చేస్తామా లేదా అన్నదే ముఖ్యమని గ్యారంటీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
మోదీ నోట కూడా గ్యారంటీ మాట !
కర్ణాటక ఎన్నికల ఫలితాల దెబ్బ ప్రధాని మోదీకి గట్టిగానే తగిలింది. ఆయన విస్తృతంగా పర్యటించినా కనీస ప్రభావం లేదు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ వాడుకున్న గ్యారంటీ పథకాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు. వారొస్తే కుంభకోణాలు గ్యారంటీ అని.. తాము ఉంటే అవినీతిపరులకు శిక్షలు గ్యారంటీ అని సభల్లో చెబుతున్నారు. అంతేనా.. తాము మళ్లీ గెలిస్తే రైతులకు ..ఏటా ఐదు లక్షల ఆదాయం గ్యారంటీ ఇస్తామని చెబుతున్నారు. ఆయన ప్రసంగాల్లో ఇప్పుడు గ్యారంటీ కీలకమయింది.
ప్రజల్ని నమ్మించడానికి రాజకీయ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తూంటాయి. అందులో ఈసారి గ్యారంటీ హైలెట్ అవుతుంది.