ఏపీలో ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ అయిపోతోంది. ప్రభుత్వ వేధింపులు.. అధికారుల వేధింపులు… బిల్లులు రాకపోవడం.. పోలీసుల టార్చర్ ఇలా ప్రతీ రోజూ ఎక్కడో చోట ఆత్మహత్యల వార్తలే కనిపిస్తున్నాయి. ఈ సారి పోలీస్ డిపార్టుమెంంట్ లోనే సీఐ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఐ ఆనందరావు డ్యూటీ చేసి ఇంటికెళ్లి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు ఇలా డ్యూటీ దిగి అలా ఇంటికెళ్లారు.. ఈ గ్యాప్లో ఏం జరిగింది? ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు ఏమై ఉంటాయి? పని ఒత్తిడా..? ఆర్థిక ఇబ్బందులా? ఆనందరావు ఆత్మహత్య వెనుక అసలు కారణాలేంటన్నది మిస్టరీగా మారింది.
ఏపీలో ఓ విచిత్రమైన స్ట్రాటజీ అమలవుతూ ఉంటుంది. టీడీపీ ఆఫీసులపై దాడి చేసి టీడీపీ వారే దాడి చేశారని చెబుతూంటారు. ఎవరిపైనైనా దాడి జరిగితే వారి మనుషుల్లో విబేధాల వల్లే దాడి జరిగిందని చెబుతూంటారు. కోడెల ఆత్మహత్య విషయంలోనూ అదే చేశారు. కుటుంబసభ్యులవల్లే ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇప్పుడు ఈ తాడిపత్రి సీఐ విషయంోలనూ ఇదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు పోలీసులు. కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ శ్రీనివాస్ ప్రకటించేశారు.
అయితే వర్క్ ప్రెజర్తోనే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఆనందరావు కూతురు. తాడిపత్రిలో పోలీసులపై ఒత్తిళ్లు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఈ ఒత్తిళ్ళ కారణంగా డ్యూటీలో ఏదో జరిగి ఉంటుందని.. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని గట్టిగా నమ్ముతున్నారు. అయితే పోలీసులు మాత్రం… కుటుంబ వివాదంలటూ మాట్లాడి… వారిపైనే నింద వేసి .. మాట్లాడకుండా సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.