పథకాల్లో అర్హులైన వారికి ఇప్పటి వరకూ పథకాలు ఇవ్వకపోవడం.. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సురక్ష పథకం పెట్టడం… కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి కూడా ఇంత కాలం నానా టార్చర్ పెట్టి ఇప్పుడు ఉచితంగా ఇస్తామని దానికో పథకం పెట్టడం… ఓ పెద్ద ప్రసహనంగా కనిపిస్తోంది. ఒక్క రోజు తొలి రోజే నాలుగైదు లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత రోజూ అదే జోరు కొనసాగుతోంది. ఇన్ని లక్షల అప్లికేషన్లు వస్తూంటే ప్రజల సాధారణ సేవల విషయంలో ఇంత ఘోరమైన వైఫల్యం ఉందా అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు
అయితే ఇన్ని లక్షల ధరఖాస్తులు రావడాన్ని వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇంత ఘోరమైన పాలన ఇప్పటివరకూ అందించామా అనే డౌట్ వారికి కూడా రాకుండా మానదు. ఇప్పుడైనా సమస్యలను పరిష్కరిస్తారా అంటే అలాంటిదేమీ లేదు. ఎమైనా పరిష్కరించినా డబ్బులివ్వాలనే డిమాండ్లు సహజంగానే వస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంత కాలం తమను కార్యాలయాల చుట్టూ తిప్పి.. ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తామంటోంది లంచాలకా అని మండిపడుతున్నారు.
నిజానికి గత ఏడాది అమ్మఒడి గ్రీవెన్స్ అని ఓ జిల్లాలో కరెక్టర్ ప్రకటన ఇస్తే… కొన్ని వేల మంది లబ్దిదారులు వచ్చారు. తమకు అర్హత ఉన్నా ఇవ్వలేదని ఫిర్యాదు చేయడానికి అంత మంది వచ్చారని తెలుసుకుని మరెక్కడ అమ్మఒడి కాదు కదా.. మరే పథకం గ్రీవెన్స్ పెట్టలేదు. వాలంటీర్లు. .. పెత్తనంతో మొత్తం వైసీపీకి ఓటేస్తారనుకున్న వారికే పథకాలు అమలు చేస్తున్నారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంత కాలం వేధించి ఇప్పుడేదో పత్రం ఇస్తానంటే… తిట్లు ఆపేసి ఆశీర్వదిస్తారా ?