తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజునూ పదవి నంచి తొలగించారు. బండి సంజయ్ ను గౌరవంగా ఢిల్లీకి పిలిపించి కారణాలు చెప్పి.. తప్పిస్తున్నామని కిషన్ రెడ్డిని నియమిస్తున్నామని.. మీకు కొత్త బాధ్యతలు ఇస్తామని జేపీ నడ్డా భరోసా ఇచ్చారు. కానీ సోము వీర్రాజుకు మాత్రం ఓ ఫోన్ కాల్ తో సరి పెట్టారు. మీ టర్మ్ అయిపోయినందున తప్పిస్తున్నామని.. రాజీనామా చేయాలని సూచించారు. దీంతో సోము వీర్రాజు రాజకీయం ఏపీ బీజేపీలో ముగిసిపోయినట్లయింది.
సోము వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజుకు ప్రో వైసీపీ నేతగా పేరు పొందారు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల పార్టీ ఎదగలేకపోయిందన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో కన్నా ఉన్నప్పుడు ప్రభుత్వంపై బీజేపీ పోరాడింది. అలాంటి పరిస్థితిలో హఠాత్తుగా కన్నాను తప్పించి సోము వీర్రాజుకు పదవి ఇచ్చారు. అప్పట్నుంచి వైసీపీ అనుబంధ పార్టీగా మారిపోయింది.
ఇప్పుడు వైసీపీ పరిస్థితి తేలిపోవడంతో .. ఆ పార్టీపై విరుచుకుపడే సత్యకుమార్ కు బాధ్యతలివ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సత్యకుమార్ కడప జిల్లాకు చెందిన నేత. వెంకయ్యనాయుడు శిష్యుడు. కొత్త చీఫ్ నియామకం తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నారు.