ఇప్పటి వరకూ మనం చూసిన తమన్నా వేరు. ఇప్పుడు చూసిన తమన్నా వేరు. తనలో బోల్డ్ నెస్ ఏ స్థాయిలో ఉంటుందో తాజా వెబ్ సిరీస్‌లతో నిరూపించింది తమన్నా. హాట్ స్టార్ వెబ్ సిరీస్ జీ కర్దాలో హాట్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది తమన్నా. ఆ వెంటనే లస్ట్ స్టోరీస్ 2లో మరింత రెచ్చిపోయింది. ఈ సిరీస్ కోసం తొలిసారి లిప్ లాక్ సన్నివేశాల్లోనూ నటించింది. తమన్నా ఇంత హాట్ గా దర్శనం ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. తమన్నా కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సిరీస్‌లు చేస్తోందని, తన ఇమేజ్ వీటితో దిగజారిపోతుందని, తమన్నాకి ఇక అవకాశాలు రావని.. జనం గగ్గోలు చేస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంత విమర్శని ఇప్పుడే ఎదుర్కొంటోంది తమన్నా.
అయితే నిజం ఏమిటంటే… ఈ హాట్ నెస్ ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతోంది. తాజాగా తమన్నా హాట్ స్టార్ కోసం ఓ రెండు వెబ్ సిరీస్‌లపై సంతకాలు చేసిందట. నెట్ ఫ్లిక్స్ కోసమూ కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకొందట. ఇదంతా.. తన బోల్డ్ నెస్ పుణ్యమే. నిజానికి వెబ్ సిరీస్‌ల తూకం ప్రకారమే.. తమన్నా ఆయా పాత్రలు చేసింది. వెబ్ సిరీస్ కంటూ ఓ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంది. వాళ్లకు ఇలాంటి బోల్డ్ కంటెంట్ బాగా నచ్చుతోంది. రానా నాయుడుని అంత తిట్టుకొన్నా – జనం చూశారు. నెట్ ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ వచ్చిన సిరీస్‌లో అది కూడా ఒకటి. ఇప్పుడు తమన్నా పుణ్యమా అని లస్ట్ స్టోరీస్కీ ఊహించని వ్యూస్ వస్తున్నాయి. తమన్నా క్రేజ్‌ని అర్థం చేసుకొన్న ఓటీటీలు సంస్థలు ఆమెతో ఇప్పుడు మరిన్ని వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నాయి. ఇదంతా తమన్నాకు ప్లస్సే కదా…!