వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ పార్టీకి పైసా ఖర్చు లేకుండా ప్రజాధనంతోనే బహిరంగసభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి రెండు,, మూడు సభలు ఏర్పాటు చేసుకుంటున్న ఆయన… ఆ సభల్లో చేసే పనులు… బటన్లు నొక్కడమే. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఏడాదికి నాలుగు సార్లు రీలీజ్ చేస్తారు. దానికి నాలుగు సార్లుప్రచారం.. సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతా కోట్ల ఖర్చు ప్రజాధనమే. ఇంతా చేసి..సభల్లో ఆయన చేస్తున్నప్రసంగాలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలు.
సీఎం జగన్ ప్రతి సభలోనూ రాజకీయ ప్రసంగాలే ఎక్కువ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో అవి రాజకీయ సభలా అనే డౌట్ అందరికీ వస్తోంది పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనేది అందరూ అనుకుంటారు. అయితే సీఎం జగన్ పరిపాలన శైలి చూస్తే.. పార్టీ వేరు.. పరిపాలనా వేరు కాదని అనుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటాయి. వేదికపై ఆ పార్టీ నేతలకు ప్రాధాన్యం లభిస్తుంది. ప్రసంగాలు కూడా పూర్తిగా రాజకీయ పరంగా సాగుతాయి.
ఇదంతా సీఎం జగన్కు తెలియక కాదు.. ఆ మాత్రం తెలియుకుండా ఉండదు.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించి.. సభలు పెట్టి విపక్షాలను ఎలా విమర్శించినా దానికో లెక్క ఉంటుంది. కానీ ఇలా అధికారిక సభల్లో విమర్శించడమే విమర్శలకు కారణం అవుతోంది. కేవలం ప్రజాధానం దుర్వినియోగం చేసి పార్టీకి వాడుకోవాలన్న దుర్బుద్దితోనే జగన్ రెడ్డి ఇలా చేస్తున్నారని అనుమానాలు అందరికీ కలిగితే అందులో వారి తప్పేంమ లేదు. జగన్ తీరే.
ఒక్ సభలే కాదు.. పార్టీ ప్రచారానికి సీఎంవో అధికారిక సోషల్ మీడియా ఖాతాల్ని వాడుకుంటూ ఉంటారు. పార్టీ నేతలతో వైసీపీపై జరిగిన సమావశాన్ని ఓ ప్రభుత్వ శాఖ పై జరిపిన సమీక్ష అన్నట్లుగా సీఎంవో సోషల్ మీడియా ఖతాల్లో పోస్ట్ చేస్తారు. దీనిపైనా ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు. అధికార దుర్వినియోగం అడ్డగోలుగా చేస్తూ షిక్కటి చిరునవ్వుతో ఉండటం అందరికీ సాధ్యంకాదేమో ?