వైఎస్ జయంతి దగ్గరకు వస్తోంది. జగన్ పులివెందులకు వెళ్లి నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే మిగతా ఎమ్మెల్యేల్లా ఆయనకూ ఓ భయం ఉంది. అదేమిటంటే… కాంట్రాక్టులు చేసిన వారు… బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి టూర్ లో వాళ్లు ధర్నా చేస్తే పరువు పోతుంది. అందుకే ఉన్న పళంగా రూ. 30 కోట్లు బిల్లులు మంజూరు చేసేసి పనులు చేసిన వారి ఖాతాల్లో జమ చేసేశారు. అక్కడ పెండింగ్ లో ఉన్నది రూ. ముఫ్పై కోట్లు కాదు. అయినా సర్దుకుంటారు.. కనీసం జగన్ రెడ్డి పరువు తీసేలా రోడ్డ మీదకు రారని అలా సర్దుబాటు చేసుకున్నారు..
సీఎం నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా 174 నియోజకవర్గాల్లో ఉండే వారి పరిస్థితి ఏమిటి.. ?. చిన్న చిన్న పనులు చేసిన వందల మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో అత్యధికులు వైసీపీ నేతలే. తమ ప్రభుత్వం తమకు ప నులు ఇచ్చిందని హుషారుగా చేసి బిల్లులు రాక వడ్డీలు కట్టుకుంటూ ఎదురు చూస్తున్నారు. వారంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరిపైనా సీఎం జగన్ దయాదాక్షిణ్యాలు చూపించడం లేదు. కానీ తనకు సమస్య వస్తుందనే సరికి .. నిధులు రిలీజ్ చేసేసుకున్నారు.
నాయకుడంటే ముందు.. తన వారికి న్యాయం చేయాలి. ఆ తర్వాతే .. తన గురించి ఆలోచించాలి. కానీ సీఎం జగన్ రెడ్డి మాత్రం కేవలం తన గురించే ఆలోచిస్తారు. మిగతా వారంతా దండగ అన్నట్లుగా ఉంటున్నారు. ఈ దారుణమైన మనస్థత్వం ఉన్న నాయకుడి వద్ద ఎలా ఉంటామని ఎక్కువ మథనపడుతున్నారు. వీరిలో చాలా మంది తన అనుచరులైన కాంట్రాక్టర్లతో హైకోర్టులో కేసులు వేయించేందుకు రెడీ అయ్యారు. పులివెందుల కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లింపులు చేయడాన్ని సవాల్ చేయబోతున్నారు.