ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నేల బారు చేసి.. ఇక మనకు పరువు, ప్రతిష్టలేమీ లేవని.. ఎవరి కాళ్ల మీద అయినా పడిపోయి కడుపు నింపుకోవచ్చనే పరిస్థితికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఈ విషయాన్ని ఘనత వహించిన ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. అధికారికంగా.. . ప్రభుత్వం అధికారిక విషయాల్ని చెప్పే సచివాలయంలోని మీడియా పాయింట్ లోనే కూర్చుని చెప్పారు.
ఏపీలో సినిమా షూటింగ్లు చేసుకోవాలంటే కేసీఆర్ అనుమతివ్వాలట. ఏపీలో షూటింగ్లు చేసుకోవాలంటే… ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వాలి కానీ.. కేసీఆర్ ఎందుకు అనుమతి ఇవ్వాలి ?. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఏపీలో సినిమాలు తీసుకుంటే కేసీఆర్ కక్ష సాధింపులకు పాల్పడతారని పోసాని అభిప్రాయం. అందుకే కాళ్లు పట్టుకుని అయినా బతిమాలుకుంటామని ఆయన అంటున్నారు. ఏపీలో సినిమాలు చిత్రీకరించినా శిక్ష లేకుండా చూస్తానని కాళ్లు పట్టుకుంటానంటున్నారు.
ఏపీ నుంచి సినీ పరిశ్రమను తీసుకొస్తామని.. షూటింగ్లకు సౌకర్యాలు కల్పిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రభుత్వం కనీసం చిన్న సీరియల్స్ షూటింగ్ ను కూడా ఆకర్షించలేకపోయింది సరి కదా గతంలో ఎవరైనా షూటింగ్ లకు వైజాగ్ లాంటి ప్రాంతాలకు వచ్చేవారు.. ఇప్పుడు పూర్తిగా సైడైపోతున్నారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకుంటున్నారు. ఆ నిందను తెలంగాణ ప్రభుత్వంపై వేసేందుకు పోసాని ఇలా తెరపైకి వచ్చి కేసీఆర్ కాళ్లుపట్టుకుంటామని ఏపీ పరువును బజారును పడేస్తున్నారు. వీళ్ల చేతకాని తనాన్ని రాష్ట్రానికి అంటించి… పరువు తీసి.. నా ఎదవతనం.. నీ ఎదవతనమేనని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఊంటారని సహజంగానే విమర్శలు వినిపిస్తున్ాయి.