అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి పాల్గొన్నారు. అయితే అసలు అల్లూరి సొంత రాష్ట్రం అయిన ఏపీలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం తరపున కనీసం నివాళులు కూడా అర్పించలేకపోయారు. చంద్రబాబు హయాంలో అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదు. దీంతో ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవలి కాలంలో సీఎం జగన్ క్షత్రియ వర్గంపై కత్తి కట్టారు. మంత్రి వర్గంలో ఉన్న ఒక్క మంత్రినీ తప్పించారు. ఆ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. పైగా రఘురామకృష్ణరాజు విషయంలో .. అశోక్ గజపతిరాజు విషయంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. వారిపై జగన్ రెడ్డికి చాలా కోపం ఉందని అంటున్నారు. అందుకే అల్లూరి సీతారామరాజు జయంతిని పట్టించుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వారిపై కోపం ఉంటే… పోరాటయోధుడు అయిన అల్లూరిపై చూపించాల్సిన అవసరం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.
జగన్ రెడ్డి మైండ్ సెడ్ ను …. ఆయన వ్యవహారశైలిని దగ్గర నుంచి చూస్తున్న వారికి మాత్రమే.. ఇందులో ఉన్న లాజిక్ అర్థమవుతుంది.. ఆయన ఎవరు ఏం చేసినా కులం కోణంలోనే చూసుకుంటారు. కసి తీర్చుకోవాలనుకుంటారు. పగ పెంచుకుంటారు. ఆ కోణంలోనే ఇప్పుడు అల్లూరి జయంతి జరగలేదన్న నిట్టూర్పులు వైసీపీలో వినిపిస్తున్నాయి.