పోలవరం నిర్వాసితుల్ని ఎకరానికి రూ. పది లక్షల పేరుతో రెచ్చగొట్టి ఓట్ల పంట పండించుకున్న జగన్ రెడ్డి .. అడ్డగోలుగా మోసం చేయడంతో నిర్వాసితులంతా రోడ్డెక్కుతారు. పోలవరం పోరు కేక పోరుతో వారంరోజులు యాత్రలు నిర్వహించారు. విజయవాడలో భారీ ధర్నా నర్వహించారు. పోలవరం నిర్వాసిత గ్రామాల గుండా వందలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా ఆర్ అండ్ ఆర్కు నిధులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అండగా నిలుస్తానని ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. గతేడాది వచ్చిన వరదల సమయంలో బాధితులకు కేవలం రూ.2 వేల నగదు, నాలుగు రకాల కూరగాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ పోలవరం పోరుకేక మహా పాదయాత్ర 300 కిలోమీటర్లుకుపైగా దూరం విజయవాడకు తరలి వచ్చారు.
నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టప్రకారం భూమికి భూమి, పరిహారం, నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. గత ప్రభుత్వాలు నిర్వాసిత కాలనీలు నిర్మించాయి. కానీ ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కూడాకల్పించడంలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 జిల్లాల ప్రజలకు మేలు చేయడానికి లక్షా ఆరువేల మంది నిర్వాసిత కుటుంబాలు సర్వం కోల్పోతున్నా వారిని రోడ్డున పడేస్తున్నారని కన్నీరు పెట్టుకుటున్నారు.
ముంపునకు గురైన నిర్వాసితులకు రూ.పది వేలు పరిహారం చెల్లిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని … . భూమికి భూమి ఇవ్వాల్సిన ప్రభుత్వం వివాదాస్పద భూములను నిర్వాసితులకు కట్టబెట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని బాధితులు మండి పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు. భూములకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామని మాట తప్పారని జగన్ పై నిర్వాసితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి విజయవాడలో నినదించినా.. నిర్వాసితుల్ని ప్రభుత్వం తరపు నుంచి పట్టించుకున్న వారు లేరు.