హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ గా దీపికా రెడ్డి నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. బాలకృష్ణను ఢీ కొట్టాలంటే ఎలాంటి ఇమేజ్ లేని నేత అవసరం అని … ఐ ప్యాక్ డిసైడ్ చేయడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీపికా రెడ్డిని ఎంపిక చేశారు . పెద్దిరెడ్డిగా అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా దీపికారెడ్డిని ఖరారు చేశారు. ఈమె పేరు దీపికా రెడ్డి అవడానికి కారణం.. రెడ్డి సామాజికవర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేనని.. నిజానికి ఆమె సామాజికవర్గం బీసీ అంటున్నారు. అలా కలసి వస్తుందని ఐ ప్యాక్ అంచనా వేసిందని చెబుతున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. ఈ సారి అక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ కొత్త నేతను ఎంపిక చేసుకున్నట్లుగా కనిపస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల సమీక్షా సమావేశానికి.. ఎమ్మెల్సీ, ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్ కు ఆహ్వానం ఇవ్వలేదు. దీపికా రెడ్డినేపిలిచారు. తాజాగా ఆమెకు ఇంచార్జ్ పదవిని ప్రకటించారు.
హిందూపురం వైసీపీలో చాలా గ్రూపులున్నాయి. కాంగ్రెస్ తరపున.. తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆగ్రోస్ చైర్మన్ పదవి ఉంది. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోనే ఉన్నారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గత ఎన్నికల్లో హిందూపురం నుంచి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ పోటీ చేశారు.. ఒకరికి ఒకరు సరిపడకపోవడంతో అందర్నీ పక్కన పెట్టి కొత్త నేతను తెచ్చారు.