దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా చేశాడు డైరెక్టర్ మహి వి.రాఘవ్. ఇప్పుడు యాత్ర 2కి శ్రీకారం చుట్టాడు. ఇందులో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితాన్ని చూపించబోతున్నాడు.
2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘనల సమాహారంగా ఈ సినిమా వుటుందట. యథార్థ సంఘటనలే అయినప్పటికీ జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు కొంత ఫిక్షన్ కూడా యాడ్ చేస్తామని స్వయంగా చెప్పాడు దర్శకుడు.
ఐతే ఇది ఎన్నికల సినిమానా? అని ప్రశ్నకు.. ఆంధ్ర ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దని, సినిమా చూసి ఎమోషనల్ అవుతారు కానీ పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారని చెప్పుకొచ్చాడు. ఐతే ఈ సినిమాని సరిగ్గా ఎన్నికల టైంలోనే రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు చెప్పడం గమనార్హం.