ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లలో పదిహేను వేల మంది మహిళల ఆచూకీ తెలియడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరి మహిళల వివరాలను వాలంటీర్లు సంఘ విద్రోహశక్తులకు ఇస్తూంటే… వారు మిగతా పని పూర్తి చేస్తున్నారని ఈ విషయంపై కేంద్రం ఇంటలిజెన్స్ నుంచే సమాచారం వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పారు. మొత్తంగా 29 వేల మంది మిస్సయితే వారిలో 14వేల మంది ఆచూకీ తెలిసింది. మిగతా పదిహేను వేల మంది ఏమయ్యారన్నది సస్పెన్స్ గా మారిందని పపవన్ అంటున్నారు.
జనసేనాని చేసిన ఆషామాషీ ఆరోపణలు కాదు. ఉమెన్ ట్రాఫికింగ్ అత్యంత హీనమైన నేరం. అదీ కూడా వేలల్లో జరుగుతోంది. నాలుగేళ్లలో పదిహేనువేల మంది మిస్ అవడం అంటే… అత్యంత సీరియస్ గా చూడాల్సిన విషయం. దీనిపై రికార్డులను పోలీసుు బయట పెట్టాల్సి ఉంది. నిజంగా రికార్డుల్లోనే ఇలా మిస్సయ్యారన్న సమాచారం ఉంటే.. వారంతా ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరు తీసుకెళ్తుననారన్నది పోలీసులు బయట పెట్టాల్సి ఉంది. అసలు దర్యాప్తు చేశారో లేదో తేలాల్సి ఉంది.
ఇంత మంది మిస్సయితే పోలీసుల వద్ద సమాచారం లేకపోతే… అది కూడా వైఫల్యం కిందనే వస్తుంది. దీనిపై జనసేన చీఫ్ ఆరోపణలు మాత్రమే చేయకుండా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే.. అసలైన మాఫియాను వెలుగులోకి తెచ్చిన వారవుతారు. మహిళల మాయంపై అప్పుడప్పుడూ .. ఆరోపణలు వస్తూంటాయి.. కానీ ఇలా పవన్ చెప్పినట్లుగా వేల మంది మిస్సవుతూంటారని మాత్రం ఎవరూ అనుకోలేకపోతున్నారు. పవన్ చేసిన ఆరోపణలు నిజం అయితే వాలంటీర్లు అత్యంత ఘోరమైన పాత్రలో ఉన్నట్లే.
వాలంటీర్ల వద్ద ప్రతి యాభై ఇళ్ల సమాచారం ఉంటుంది. వారి గురించి మొత్తం డీటైల్స్.. డాటా సేకరించి ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో … ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి వ్యక్తిగత వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదంతా వాలంటీర్ల మాయేనని చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి సమాచారాన్ని ఉపయోగించుకుని మహిళల్ని మాయం చేయడం మాత్రం ఘోరం. దీనిపై కేంద్ర, రాష్ట్రాలు జోక్యం చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వంపైనే ఆరోపణలు వస్తున్నాయి..కేంద్రం సీరియస్గా తీసుకోవాల్సి ఉంది.