ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను .. సీఈసీ ఢిల్లీకి పిలిపించింది. ఆయన ఎన్నికలసంఘం ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో ఓట్ల గల్లంతు.. దొంగ ఓట్ల చేరికపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాలతో సహా ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవి ఊహించనంతగా ఉండటంతో.. ఆయనను వివరణ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిపించారన్న ప్రచారం ఏపీలో జరుగుతోంది.
కానీ అలాంటి ప్రచారం వ్యూహాత్మకంగా చేస్తున్నారని.. ఏపీలో ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై పూర్తి వివరాలతో ఎస్ఈవో ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జగన్ రెడ్డి కేంద్ర పెద్దలతో మాట్లాడారని..ఈసీని కూడా సంప్రదించారని చెబుతున్నారు. అందుకే ఈసీ కూడా సన్నాహాలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో షెడ్యూల్ రావాల్సి ఉంది. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరుగుతుంది. ఇందు కోసం ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు పూర్తి చేసింది. ఏపీలోనూ అంతర్గతంగా పనులు చేస్తోందని అంటున్నారు. బుధవారం సీఎం జగన్ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.