వైరల్ కంటెంట్ ని వాడుకోవడమే ఇప్పుడు ట్రెండ్. సోషల్ మీడియా, యూట్యూబ్ లోని వైరల్ స్టప్ ని వెండితెర చూపించి ఆడిటోరియంని అలరించడంపై ద్రుష్టి పెట్టారు మేకర్స్. దీనికి మెగాస్టార్ చిరంజీవి కూడా అతీతం కాదు. వాల్తేరు వీరయ్యలో జంబలకిడి జారు మిటాయి అని చిరంజీవి అంటే థియేటర్ ఒక్కసారిగా ఊగింది. ఇదీ సోషల్ మీడియా వైరల్ కంటెంట్ మహత్తు. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు మెగాస్టార్.
భోళా శంకర్ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ వదిలారు. ఆ పాట పేరు కూడా ఎవరికీ రిజిస్టర్ కాలేదు. ఐతే ఇప్పుడు జామ్ జామ్ జజ్జనక అనే రెండో పాట వదిలారు. ఈ పాట పల్లవి, చరణం పక్కన పెడితే పాట మధ్యలో మిక్స్ చేసిన నర్సాపెల్లే గండిలోన గంగధారి అనే తెలంగాణ ఫోక్ సాంగ్ ని మిక్స్ చేయడం కిక్ ఇచ్చింది.
కనకవ్వతో పాటు సింగర్ మంగ్లీ పాడిన ఈ తెలంగాణ ఫోక్ నెంబర్ యూట్యూబ్ ని ఓ ఊపు ఊపింది. ఇప్పుడే ఇదే పాటని వాడుకున్నారు మెగాస్టార్. రవితేజ పల్సర్ బండి పాటని వాడుకొని ధమాకా హిట్ కొట్టాడు. ఆ పాట సినిమాలో బాగా క్లిక్ అయ్యింది. ఇప్పుడు భోళా శంకర్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ నర్సాపెల్లే పాటని మిక్స్ చేశారు. మరి ఇది ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.