జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిర్వాకాలు, అరాచకాలపై యుద్ధం ప్రారంభించారు. వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని ప్రజల్ని భయపెట్టేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఆ వ్యవస్థ అండగా చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్నారు.అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం ధైర్యంగా బయటకు రాలేకపోతున్నారు. ఆ వాలంటీర్ల వెనుక దాక్కుంటున్నారు. రోడ్లపైకి వారినే తీసుకు వచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. ఆందోళనలు చేయకపోతే ఆ వాలంటీర్ ఉద్యోగం కూడా ఉండదన్నట్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
జగన్ రెడ్డి దైర్యంగా మీడియా ముందుకు వచ్చి.. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలకు సమాధానం చెప్పి ఉంటే.. ఆయన భయపడలేదని అనుకోవడానికి అవకాశం ఉండేది. కానీ వాలంటీర్లను రంగలోకి దింపి నిరసనలు చేయించడం… దిష్టిబొమ్మలు తగులబెట్టించడంతోనే జగన్ రెడ్డి రాజకీయంగా వెనుకబడిపోయారన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ పోరాటం చేస్తున్నారు. వాలంటీర్లను ఏమీ అనలేదు. రూ. ఐదు వేలు ఇచ్చి ప్రజా భద్రతను … వారికి ముప్పు తెచ్చి పెట్టే పనులను వారితో చేయిస్తున్నారు. దీంతోనే అసలు సమస్య వస్తోంది. దీన్నే పవన్ ప్రశ్నిస్తున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. తన విధానాలను గట్టిగా చెప్పలేకపోయారు. బహిరంగసభల్లో చూసి .. జీవీడీ కృష్ణమోహన్ రాసే బూతులు చదివేసి.. వెళ్లిపోతారు కానీ… ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు వాలంటీర్లను కూడా అడ్డుపెట్టుకుటున్నారు కానీ.. ఆ వ్యవస్థ చట్ట వ్యతిరేకం అంటూ వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంత దారుణమైన రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్న ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ యుద్ధం .. కీలక దశలో ఉంది. కానీ అసలైన వారు మాత్రం ఇంకా వాలంటీర్ల వెనుకే దాక్కుంటున్నారు.