ఏపీ రాజకీయాల్లో బూతుల దరిద్రం తెచ్చి పెట్టిన రాజకీయ పార్టీగా వైసీపీ .. .ఎప్పటికీ ప్రజలు అసహ్యించుకునే పార్టీగా ఉండిపోతుంది. వారి వరసలు లేకుండా.. ఆడా, మగా తేడాలేకుండా ఆ పార్టీలో ఉన్న నేతలంతా నోటి విరోచినాలు చేసుకునేవాళ్లే. అదే..ఇతర నేతలు వైసీపీ నేతల్ని పద్దతిగా మాట్లాడినా.. వారికి కోపం వచ్చేస్తుంది. పవన్ కల్యాణ్.. తాను ఇక జగన్ రెడ్డిని గౌరవించేది లేదని.. ఏకవచనంతోనే సంబోధిస్తానని ప్రకటించారు. దీనికి కారణం ఉంది. స్వయంగా జగన్ రెడ్డే అలా మాట్లాడుతూంటే.. ఆయనకు గౌరవం ఇవ్వడం ఏమిటని అందరూ ఇలాగే అనుకుంటున్నారు.
గతంలో చంద్రబాబు కూడా గౌరవించేవారు. నిజానికి చంద్రబాబు ఎంత చిన్న వ్యక్తినైనా.. మీరు అనే సంబోధిస్తారు. కానీ జగన్ రెడ్డిని కూడా వాడు.. వీడు అని అప్పుడప్పుడు సంబోధిస్తున్నారంటే.. .. జగన్ రెడ్డి తన గౌరవాన్ని ఎంతగా దిగజార్చుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి జగన్ రెడ్డిని అనుచితంగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు తెర ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. కానీ.. అంతకు మించి అంటామని ఇతర నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
ఇతర నేతలు అసభ్యంగా దూషిస్తున్నారని వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి.. కనీసం అందులోనైనా పద్దతిగా మాట్లాడుతారా అంటే. .. అదీ లేదు. దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగులతో బూతులే మాట్లాడుతారు. రోజాప్రెస్ మీట్ లో పద్దతిగా మాట్లాడాలని.. విపక్ష నేతలకు నీతులు చెప్పి తాను మాట్లాడిన మాటలు వింటే… వాళ్లను ఎన్ని అన్నా తప్పులేదన్న అభిప్రాయానికి ప్రజలు వస్తారు. ఇప్పుడు అధికారంలోనే అన్ని మాటలు పడుతున్నారు వైసీపీ నేతలు.. అధికారం పోతే.. వారు పడాల్సిన మాటలకు ప్రజల సానుభూతి కూడా రాదు.