నాలుగేళ్ల పాటు పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించి..ఇప్పుడు రెండు వేల నోట్ల రద్దు తర్వాత ఇక అవసరం లేదనుకున్నారో… లేకపోతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అనుకున్నారో కానీ డిజిటల్ పేమెంట్స్ పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రతి మద్యం దుకాణం ముందు క్యూఆర్ కోడ్ పెట్టారు. కానీ నిజంగానే ఆన్ని చోట్లా తీసుకుంటున్నారా అంటే.. అది అక్కడ షో కోసమే పెట్టారన్న ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తోంది.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించిన దాని ప్రకారం జులై 8, 2023న తీసుకుంటే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల పరిధిలో 67,818 మంది డిజిటిల్ పద్ధతుల్లోనే చెల్లింపులు జరిపారు. మూడు వేల దుకాణాలు ఉంటే.. అందులో అరవై వేల మంది మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేశారు. కనీసం దుకాణానికి ఇరవై మంది కూడా డిజిటల్ చెల్లింపులు చేయరా ? 9వ తేదీన 93,227 మంది డిజిటిల్ పద్ధతుల్లోనే చెల్లింపులు జరిపారని చెప్పుకొచ్చారు. మద్యం దుకాణాల్లో దందాపై పవన్ ఆరోపణలు చేసిన రోజున.. మరో పది మందికి డిజిటల్ చెల్లిపంులు చేసే అవకాశం కల్పించారన్నమాట.
అంటే పేరుకే డిజిటల్ చెల్లింపులు పెట్టారు. ఎన్నికల సమయంలో ఏదైనా ఊరిలో రిగ్గింగ్ చేసుకోవావాలంటే.. వెయ్యి ఓట్లు ఉంటే990 తాము గుద్దేసుకుని పది ఓట్లు వేరే పార్టీకి వేస్తారు. అలాగే… వచ్చిన అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఓ ఇరవై, ముప్ఫై మంది దగ్గర మాత్రం డిజిటల్ పేమెంట్స్ తీసుకుని … గొప్పగా అమలు చేస్తున్నామని అంటున్నారు. ఇలా డిజిటల్ పెమెంట్స్ తీసుకోకపోవడానికి ప్రధానంగా సిబ్బంది చెబుతున్న కారణం.. మద్యం బాటిల్ స్కాన్ కాకపోవడం.. .అంటే దొంగ మద్యం అన్నమాటేగా ? . ఇవన్నీ ఇప్పుడు బయటకు రావు.. .. ఎందుకంటే.. అసలు స్కామ్ స్టర్ల చేతిలోనే కదా అధికారం ఉందని సెటైర్లు వినిపిస్తున్నాయి.