వైసీపీ నేతలు ఏపీలో తమకు ఎదురు లేదని..ఎవరిపైన అయిన సరే ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేయవచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ.. చేసినంత కాలం చేయగలుగుతారు.. ఎప్పటికైనా వాటి ఫలితాలను అనుభవించాల్సిందే. ఇప్పుడు సమయం దగ్గర పడుతున్నకొద్దీ అలాంటి ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్లు కోర్టు కేసుల పాలవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఎమ్మెల్సీ పోతుల సునీత, అడవుల కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటిపై లోకేష్ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వాటిపై వాంగ్మూలం ఇచ్చేందుకు స్వయంగా హాజరవుతున్నారు.
వీరిద్దరూ అడ్డగోలుగా చేసిన ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి .. లోకేష్ తో ఉన్న భూవివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం చేశారు. అందుకోసం ఫేక్ సర్వే నెంబర్లు కూడా పెట్టారు. తర్వాత అది డిలీట్ చేసి.. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోస్టు పెట్టారు.
తర్వాత పోతుల సునీత నారా చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని హెరిటేజ్ సంస్ధ ద్వారా సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని, లోకేష్‌కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదని.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని దారుణమైన విమర్శలు చేశారు.వీటన్నింటిన రికార్డెడ్ సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించి క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 13,14వ తేదీలలో పాదయాత్రకు విరామం ఇచ్చారు.
ఇప్పటికే సాక్షి పత్రిక పైచినబాబు చిరుతిండి అనే రాసిన కథనంపై విశాఖలో పరువు నష్టం దావా వేశారు. ఈ వార్తలు రాసిన ఇతర పత్రికలు లోకేష్ కు క్షమాపణలు చెప్పాయి. సాక్షిపై పరువు నష్టం కేసు విచారణ జరుగుతోంది. ఇటీవలే.. సాక్షికి గీతం భూముల విషయంలో తప్పుడు రాతలు రాసినదుకు రూ. ఐదు లక్షల జరిమానా విధించారు.