ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరి సమాచారం.. వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, వివాహేతర బంధాలు ఇలా ప్రతి ఒక్క సమాచారం వైసీపీ దగ్గర ఉంది. ప్రభుత్వం దగ్గర కాదు.. పూర్తిగా వైసీపీ దగ్గరే ఉంది. వాలంటీర్లు ఇస్తున్న సమాచారం నేరుగా వైసీపీ నేత ఏర్పాటు చేసిన ఎఫ్.వో.ఏ అనే ఏజెన్సీ చేతికి వెళ్తోంది. పవన్ కల్యాణ్ చెప్పిన నానక్ రామ్ గూడ కంపెనీ ఇదేనని భావిస్తున్నారు.
అసలేమిటో ఎఫ్.వో.ఏ
ఎఫ్.వో.ఏ అంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. దీనికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి యజమాని. ప్రభుత్వం వచ్చిన తరవాత ఈ కంపెనీకి డేటా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ సంస్థ గ్రామ, వార్డు సచివాలయాల్లోని వాలంటీర్ల నెట్ వర్క్ ను కమ్యూనికేట్ చేస్తుంది. అంటే.. వారి సేకరించే డేటాను డిటైలింగ్ చేస్తుంది . ఈ సంస్ధ 2020 లో ప్రారంభమైనట్లుగా సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకున్నారు.
డేటా సేకరించడం కాదు.. ఏ డేటా తీసుకోవాలో కూడా డిసైడ్ చేస్తుంది !
వాలంటీర్లు పూర్తిగా సమాచార సేకరణకే సమయం కేటాయిస్తున్నారు. నిజానికి వారు చేసే పనులు కూడా ఏమీ ఉండవు. ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వడం.. తర్వాత ఎఫ్.వో.ఏ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం డేటాను కలెక్ట్ చేయడమే వారి పని. వాలంటీర్లకు ఎఫ్ వో ఏ అనేక టాస్కులు ఇస్తుంది. అందులో ఆస్తుల వివరాలు కూడా సేకరించమని ఉంటుంది. వలంటీర్లు సేకరించే ప్రతి డేటా వీరికి చేరుతుంది. ఈ వివరాలన్నింటినీ … ఏం చేస్తారన్నది తర్వాత సంగతి..కానీ ఇలా ప్రైవేటు సంస్థ అదీ వైసీపీ నేత నిర్వహిస్తున్న సంస్థ చేతుల్లోకి వెళ్లడమే అసలు అతిపెద్ద స్కాం.
ప్రజలపై అతిపెద్ద కుట్ర !
వ్యక్తిగత సమాచారంతో పూర్తి స్థాయిలో ప్రజలపై కుట్ర చేయబోతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ.. ఆపార్టీ.. ఈ పార్టీ అనే తేడా ఉండదు.. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి వ్యక్తిగత వివరాలను బయట పెట్టడం.. కుటుంబ ఫోటోలను వెలుగులోకి తేవడం వంటివి చేయవచ్చు. ఇలాంటివి ఇప్పటికే జరుగుతున్నాయి.
డేటా బ్రీచ్ అతి పెద్ద నేరాల్లో ఒకటి !
ప్రభుత్వం సేకరించే సమాచారం అవసరానికే ఉండాలి. కానీ అవసరం లేకపోయినా అన్ని రకాల సమాచారాలు.. చివరికి వివాహేతర బంధాలు ఉన్నాయా అన్నవి కూడా సేకరించడం దారుణంగా మారింది. ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం మరింత ఘోరం. రాబోయే రోజుల్లో ఈ డేటాబ్రీచ్ ఘోరాలు ప్రజలు చాలా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంత మంది వ్యక్తిగత జీవితం సోషల్ మీడియా పాలైంది. చాలా మందికి అదే పరిస్థితి రానుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.