అప్పుడెప్పుడో కల్నర్ గడాఫీ రక్షణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా సాయుధులు ఉండేవారని కథలు కథలుగా మీడియాలో చెప్పుకున్నారు. ఇటీవల ఉత్తర కొరియా నియంత కూడా మహిళల సెక్యూరిటీకే ప్రాధాన్యమిస్తారని హైలెట్ అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళా సెక్యూరిటీపై అపారమైన నమ్మకం ఏర్పడినట్లుగా ఉంది. ఆయన భద్రత కోసం మెరికలైన మహిళా పోలీసుల్ని ఎంపిక చేసి ప్రత్యేకమైన శిక్షణ కార్యాక్రమాన్ని ఇచ్చారు. వారంతా విధుల్లో చేరబోతున్నారు. వీరంతా కనీసం యాభై నుంచి వంద మంది వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలు వచ్చాయి. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు… తర్వాత చేసిన నిర్వాకాల కారణంగా.. అంత తేలిగ్గా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. ఆయన ఓ సారి హెలికాఫ్టర్ చెడిపోయిందని.. ఓ ఇరవై కిలోమీటర్లు అనుకోని రోడ్డు ప్రయాణం..అదీ కూడా మీడియాకు కూడా తెలియకుండా చేస్తే… రెండు, మూడుచోట్ల గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినా ఇదే పరిస్థితి. ఈ సారి మహిళా వర్గాల నుంచి ఎదురయ్యే నిరసన ఎక్కువగా ఉండనుంది. తిరుమలలో ఉన్న పారిశుధ్య కార్మికుల నుంచి అంగన్ వాడి కార్యకర్తల వరకూ జగన్ అందర్నీ మోసి శాపనార్ధాలు తింటున్నారు. జనంలోకి వెళ్తే వారి నుంచి రక్షణ కోసం.. మహిళా టీంను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రెడ్డి ప్రజలను పట్టించుకున్నది లేదు. ..కలిసింది లేదు. సమస్యలు విన్నది లేదు. సాయంత్రం ఆరు తర్వాత తాడేపల్లిలో కుట్రలు, కుతంత్రాలకే పరిమితమవుతారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆయన సెక్యూరిటీ కోసం మాత్రం… గత నాలుగేళ్లుగా కోట్లు ఖర్చుపెట్టి వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ఇల్లు గత నాలుగేళ్లుగా 144 సెక్షన్ కిందనే ఉంది. ఇప్పుడు మహిళా పోలీసులతో రక్షణకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓ సీఎం ఇంత భయపడటం.. చరిత్రలో లేదన్నసెటైర్లు అందుకే వినిపిస్తున్నాయి.